ఏసీబీకి పట్టుబడి, లంచం డబ్బు టాయ్‌‌లెట్‌లో ఫ్లష్

By Siva KodatiFirst Published Mar 26, 2019, 9:09 AM IST
Highlights

హైదరాబాద్‌లో ఓ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

హైదరాబాద్‌లో ఓ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బషీర్‌బాగ్‌కు చెందిన షకీల్ అన్సారీ షాద్‌నగర్‌లోని జూనియర్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో ఒక కేసులో తన తల్లి పేరు లేకుండా చేయాలంటూ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి షకీల్‌ను కోరాడు. అయితే ఇందుకు గాను రూ.8 వేలు లంచంగా ఇవ్వాలంటూ అతను డిమాండ్ చేశాడు.

దీంతో ప్రభాకర్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో సోమవారం ఉదయం అతని ఆఫీసు వద్దకు ప్రభాకర్ రెడ్డిని పంపిన ఏసీబీ అధికారులు.. లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

అయితే ఏసీబీ రాకను పసిగట్టిన అన్సారీ కరెన్సీ నోట్లను చించి వాటిని టాయ్‌లెట్‌లో ఫ్లష్ చేశాడు. దీంతో అధికారులు దెబ్బతిన్న కరెన్సీ ముక్కలను స్వాధీనం చేసుకుని షకీల్‌ను అరెస్ట్ చేశారు. 

click me!