
సిద్ధిపేట జిల్లాలో (siddipet district) దారుణం చోటు చేసుకుంది. వెంకట్రావు పేటలో మిరుదొడ్డి రాజశేఖర్ అనే వ్యక్తి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తన 14 నెలల పసిపాపను కరెంట్ షాకిచ్చి (electric shock) చంపాడు. తర్వాత తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిని గమనించిన స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అటు చిన్నారిని సిద్ధిపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.