ధాన్యం కొనుగోలుపై స్పష్టత వచ్చేవరకు ఆందోళన: రాజ్యసభ నుండి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్

By narsimha lode  |  First Published Dec 3, 2021, 5:08 PM IST

వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టత  ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని టీఆర్ఎస్ ఎంపీలు  తేల్చి చెప్పారు.పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసనను కొనసాగిస్తున్నారు.


హైదరాబాద్: Paddy ధాన్యం కొనుగోలు విషయమై  కేంద్రం నుండి స్పష్టత వచ్చే వరకు తమ నిరసన కొనసాగుతుందని Trs ఎంపీలు ప్రకటించారు.  ఈ డిమాండ్ తో రాజ్యసభ నుండి  శుక్రవారం నాడు టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు K. Keshava rao, Nama nageswara raoలు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.Parliament సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి ఇప్పటి వరకు  వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి  స్పష్టత కోరినా కూడా  ఇంత వరకు ప్రభుత్వం నుండి  స్పష్టత ఇవ్వలేదన్నారు. ఇవాళ పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్  సరైన సమాధానం ఇవ్వలేదని కె. కేశవరావు చెప్పారు. అంతకు ముందు ఈ విషయమై టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో సమాధానం చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు  Rajya sabhaలో మంత్రి  Piyush Goyal సమాధానం చెప్పారు.ప్రతి ఏటా Paddy ధాన్యం కొనుగోళ్లను పెంచుకొంటూ పోతున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.

ఇవాళ ఈ విషయమై టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై రాష్ట్ర ప్రభుత్వం చేసుకొన్న ఎంఓయూ ఆధారంగా కొనుగోళ్లు చేస్తామని ఆయన చెప్పారు. ప్రతి విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఖరీఫ్ సీజన్ ద్వారా యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయమై  ఆలోచిద్దామని మంత్రి రాజ్యసభలో తేల్చి చెప్పారు.అన్ని రాష్ట్రాలతో వరి ధాన్యం కొనుగోలు విషయమై ఎంఓయూలు చేసుకొంటామని ఆయన గుర్తు చేశారు. దీని ప్రకారంగానే తాము ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బాయిల్డ్ రైస్ ఇవ్వమని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం తమకు లేఖ ఇచ్చిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తాయని టీఆర్ఎస్ ఎంపీ  కేశవరావు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

Latest Videos

undefined

also read:వరిధాన్యం కొనుగోలుపై తెలంగాణ సర్కార్ రాజకీయం: రాజ్యసభలో పీయూష్ గోయల్

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గింజ వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఓ కేంద్ర మంత్రి చేసిన ప్రకటనను టీఆర్ఎస్ ఎంపీ కేకే మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని మంత్రికి చూపారు.  గత ఏడాది 94 లక్షల మెట్రిక్ టకన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసిందన్నారు.ఈ ఏడాది ఇప్పటివరకు 19 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని కేశవరావు కేంద్ర మంత్రి  పీయూష్ గోయల్ దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా ఎంత కొంటారో కేంద్రం చెప్పాలని కేశవరావు డిమాండ్ చేశారు. అంతేకాదు రకాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో 60 శాతం వరి సాగరు విస్తీర్ణం పెరిగిన విషయాన్ని కేశవరావు గుర్తు చేశారు

click me!