కోడలిపై అత్యాచారం.. కటకటాల్లోకి మామ.. ఢిల్లీనుంచి వచ్చి...

Published : Feb 26, 2021, 04:01 PM IST
కోడలిపై అత్యాచారం.. కటకటాల్లోకి మామ.. ఢిల్లీనుంచి వచ్చి...

సారాంశం

కామంతో కళ్లు మూసుకుపోయి సొంత కొడుకు భార్యపై లైంగికదాడి చేశాడో మామ. తమది కాని రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలో కోడలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కామాంధుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్, నాంపల్లిలో జరిగింది. 

కోడలిపై మామ అత్యాచారం చేసిన సంఘటన నాంపల్లి, హబీబ్ నగర్ లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు మామను అదుపులోకి తీసుకుని అతడిమీద కేసు నమోదు చేశారు. 

హబీబ్ నగర్ ఇన్ స్పెక్టర్ పూసపాటి శివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన ఓ వస్త్రవ్యాపారి(52), అతడి కోడలు.. అంటే కొడుకు భార్య (22) ఇద్దరూ బట్టలు కొనడానికిి హైదరాబాద్ కు వచ్చారు. 

ఇద్దరూ బజార్ ఘాట్ రోడ్డులో ఉన్న సుభాన్‌ బేకరీ ఎదురుగా ఉండే ఎన్ఆర్ రెసిడెన్సీ లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. వీరిద్దరూ బుధవారం రాత్రి లాడ్జిలోని గదిలోనే బస చేశారు. అయితే రాత్రి ఏమయిందో తెలియదు కానీ, మరుసటి రోజు ఉదయం కోడలు తన మామ మీద హబీబ్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. 

తనను అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడైన మామను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి పంపించారు. 

భరోసా కేంద్రం నుంచి ఈ కేసుకు సంబంధించిన నివేదిక రాగానే తగిన చర్యలు, చట్టపరంగా తీసుకుంటామని హబీబ్ నగర్ ఇన్ స్పెక్టర్ పూసపాటి శివచంద్ర తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu
Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?