విషాదం : కూతురు పెళ్ళికి రెండు గంటలముందు.. గుండెపోటుతో తండ్రి మృతి...

Published : Sep 04, 2023, 10:14 AM IST
విషాదం : కూతురు పెళ్ళికి రెండు గంటలముందు.. గుండెపోటుతో తండ్రి మృతి...

సారాంశం

కూతురి పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకున్న తరువాత.. ఇక పెళ్లి రెండు గంటల్లో ఉందనగా ఓ తండ్రి గుండెపోటుతో మరణించాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

కరీంనగర్ : తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని శంకరపట్నం మండలంలో ఉన్న అంబాలాపురం గ్రామంలో ఓ పెళ్ళింట విషాద ఘటన చోటు చేసుకుంది. కూతురుపెళ్లికి అన్నీ సిద్ధం చేసిన తండ్రి మరో రెండు గంటల్లో పెళ్లి ఉందనగా గుండెపోటుతో మృతి చెందాడు. దీనికి సంబంధించి గ్రామస్తులు ఈ మేరకు వివరాలు తెలియజేశారు…

అంబాలాపురం గ్రామానికి చెందిన ఎర్రల రాములు (48) మండల కేంద్రంలో ట్రాక్టర్ మెకానిక్ గా పని చేస్తున్నాడు. రాములు భార్య పేరు మంజుల. వీరికి ముగ్గురు కూతుర్లు. ట్రాక్టర్ మెకానిక్ గా పని చేస్తూనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పెద్ద కూతురు లావణ్యకు  వివాహం చేయాలని నిశ్చయించి.. ఆదివారం ఉదయం 10 గంటలకు ముహూర్తం పెట్టుకున్నారు.

తెలంగాణ హైకోర్టు తీర్పుపై సవాల్: సుప్రీంను ఆశ్రయించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

ఆమె వివాహం కొత్తగట్టు శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి గుట్టపై చేయాలని అందరూ తరలి వెళ్లడానికి సిద్ధమయ్యారు. వివాహానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మరో రెండు గంటల్లో పెళ్లి.  ఇంతలో పెళ్లికూతురు లావణ్య తండ్రి ఎర్రల రాములకి హఠాత్తుగా గుండెల్లో నొప్పి వచ్చింది. వెంటనే కుప్పకూలిపోయాడు. అది గమనించిన బంధువులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి రాములను తరలించారు.

అక్కడికి వెళ్లిన తర్వాత రాములను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మరో రెండు గంటల్లో కూతురి పెళ్లిని  చేయాల్సిన తండ్రి… అనుకోకుండా హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందడంతో జరగాల్సిన పెళ్లి కాస్త ఆగిపోయింది. అప్పటివరకు సంతోషంతో కలకలలాడిన పెళ్లిళ్లు… రాములు మరణంతో విషాదంలో మునిగిపోయింది. 

రాములు మృతితో గ్రామంలో కూడా విషాదఛాయలు నెలకొన్నాయి. రాములు భార్య మంజుల, ముగ్గురు కుమార్తెలు గుండెలవిసేలా రోధించడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. 

PREV
click me!

Recommended Stories

రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే