జగిత్యాలలో మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు.. రాజీనామాకు సిద్దమంటున్న సర్పంచ్‌లు..

By Sumanth Kanukula  |  First Published Jan 11, 2023, 3:00 PM IST

జగిత్యాలలో ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కారు. బుధవారం ఆందోళనలను మరింత ఉధృతం చేశారు.


జగిత్యాలలో ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కారు. బుధవారం ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. ప్రతిపాదిత జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌ అమలైతే మొత్తం 250 ఎకరాల భూమిని కోల్పోతామని ఆరోపిస్తూ చుట్టుపక్కల గ్రామాల రైతులు నిరసన బాట పట్టారు. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని  రైతులు డిమాండ్  చేశారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలో  ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్‌‌ ఫ్లెక్సీలను నిరసనకానరులు చించేశారు. బుధవారం కూడా రైతులు నిరసనలు కొనసాగిస్తుండగా.. పలు రాజకీయ పార్టీలు వారికి మద్దతు తెలుపుతున్నాయి. బీఆర్ఎస్ స్థానికులు నాయకులు కొందరు రైతుల నిరసనకు మద్దతు తెలుపుతున్నారు. 

రైతుల నిరసనలకు మద్దతుగా పార్టీలకు అతీతంగా జేఏసీని ఏర్పాటు చేస్తున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో పోరాట కార్యచరణ సిద్దం చేస్తున్నారు. రైతుల నిరసనకు మద్దతుగా నాలుగు గ్రామాల సర్పంచ్‌లు రాజీనామాలకు కూడా సిద్దమయ్యారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

Latest Videos

click me!