ఆందోళన విరమించిన రైతులు : కలెక్టర్ దిష్టిబొమ్మకు వినతిపత్రం, ఆపై దగ్థం.. రేపు కామారెడ్డి బంద్‌కు పిలుపు

Siva Kodati |  
Published : Jan 05, 2023, 08:16 PM ISTUpdated : Jan 05, 2023, 08:21 PM IST
ఆందోళన విరమించిన రైతులు : కలెక్టర్ దిష్టిబొమ్మకు వినతిపత్రం, ఆపై దగ్థం..  రేపు కామారెడ్డి బంద్‌కు పిలుపు

సారాంశం

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళన విరమించారు. అయితే రేపు కామారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తెలిపింది.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ ఉదయం నుంచి ఆందోళన నిర్వహించిన రైతులు ఇవాళ్టీకి శాంతించారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన విరమించిన రైతులు .. రేపు కామారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. కలెక్టర్ దిష్టి బొమ్మకు వినతి పత్రం ఇచ్చి అనంతరం దిష్టి బొమ్మను తగులబెట్టారు. ఇవాళ్టీకి ఆందోళన విరమిస్తున్నట్లు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తెలిపింది. 

కాగా.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను నిరసిస్తూ రైతులు కొన్ని గంటలుగా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక దశలో గేట్లు ధ్వంసం చేసి లోపలికి వెళ్లేందుకు అన్నదాతలు ప్రయత్నించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు రైతులను బుజ్జగించేందుకు జిల్లా ఎస్సీ శ్రీనివాస్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. వారితో చర్చలు జరిపిన ఆయన.. గాంధేయ మార్గంలో ఆందోళన చేయాలని హితవు పలికారు. 

ALso Read: కామారెడ్డి : రంగంలోకి ఎస్పీ, లోనికి ఐదుగురికే అనుమతి.. కలెక్టర్ రావాల్సిందేనంటూ రైతుల పట్టు

మాస్టర్ ప్లాన్ ముసాయిదా ఇంకా ఆమోదం పొందలేదని.. రైతుల తరపున ఐదుగురు వస్తే కలెక్టర్‌తో చర్చలు జరిపిస్తామని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రైతులపై తమకు ఎలాంటి కోపం లేదని.. కలెక్టర్ రైతుల దగ్గరకు రారని, రైతులే కలెక్టర్ వద్దకు వెళ్లాలని ఎస్పీ కోరారు. అయితే రైతులు మాత్రం పట్టువీడటం లేదు. కలెక్టరే తమకు దగ్గరికి వస్తే ఆందోళన విరమిస్తామని తేల్చిచెబుతున్నారు. మరోవైపు కలెక్టర్ జితేష్ పాటిల్ మాత్రం తన ఛాంబర్‌లోనే వున్నారు.

అయితే రైతుల ఆందోళన తీవ్రరూపు దాల్చడానికి కలెక్టర్ జితేష్ పటేల్ మొండివైఖరే కారణమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రైతులతో మాట్లాడకూడదనే పంతంతో కలెక్టర్ వున్నారు. రైతుల ముట్టడితో కలెక్టరేట్ హోరెత్తుతున్నా విషయాన్ని పోలీసులకే వదిలేశారు కలెక్టర్. రైతు ఆత్మహత్య చేసుకున్నా స్పందించకపోవడంతో ఆయనపై అన్నదాతలు భగ్గుమంటున్నారు. కలెక్టర్ వచ్చి తమతో మాట్లాడేదాకా ఆందోళన విరమించేది లేదని రైతులు తేల్చిచెబుతున్నారు. కలెక్టర్ వచ్చి తమ నుంచి వినతిపత్రం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : మళ్లీ వర్షాలు... ఈసారి ఫిబ్రవరిలో కంటే భారీగా, బిఅలర్ట్
Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu