తాళ్లతో కట్టుకొని.. కూతురు సహా చెరువులోకి దూకిన దంపతులు

Published : Aug 30, 2021, 08:19 AM ISTUpdated : Aug 30, 2021, 08:28 AM IST
తాళ్లతో కట్టుకొని.. కూతురు సహా చెరువులోకి దూకిన దంపతులు

సారాంశం

 శ్రీనివాస్ భార్య లావణ్యను గ్రామస్థులు కాపాడారు. వెంటనే ఆమెను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లావణ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


తాళ్లతో ఒకరినొకరు కట్టేసుకొని.. కుమార్తె సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మెదక్ జిల్లా బొల్లారంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బొల్లారానికి చెందిన ఓ కుటుంబం తాళ్లతో కట్టుకొని చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా ఈ ఘటనలో భార్య ప్రాణాలతో బయటపడగా.. ఆమె భర్త శ్రీనివాస్(40), కుమార్తె కృతి(11) మృతి చెందారు.  శ్రీనివాస్ భార్య లావణ్యను గ్రామస్థులు కాపాడారు. వెంటనే ఆమెను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లావణ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఆర్థిక పరిస్థితుల కారణంగానే వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ బొల్లారంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం