వరంగల్ లో ఆస్పత్రి పెట్టేశాడు: యూట్యూబ్ చూస్తూ అబార్షన్లు చేస్తున్నాడు

By telugu teamFirst Published Mar 26, 2021, 7:06 AM IST
Highlights

వరంగల్ లో ఓ మెడికల్ రిప్రజెంటిటీవ్ వైద్యుడి అవతారమెత్తాడు. వరంగల్ ఆస్పత్రి పెట్టి మహిళలకు అబార్షన్లు చేస్తున్నాడు. యూట్యూబ్ చూసి అతను అబార్షన్ల వ్యవహారం సాగిస్తున్నాడు.

వరంగల్: ఓ నకిలీ డాక్టర్ గుట్టును వైద్యాధికారులు రట్టు చేశారు బిఎస్సీ చదివి ఎంబీబీఎస్ డాక్టర్ గా చెలామణి అవుతున్నాడు. వృత్తిరీత్యా మెడికల్ రిప్రజెంటెటివ్. అతను తెలంగాణలోని వరంగల్ లో ఆస్పత్రిని నడిపిస్తున్నాడు. యూట్యూబ్ చూస్తూ అబార్షన్లు చేస్తున్నాడు.ఆ విషయం తెలిసి బుధవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడి చేసి అతన్ని పోలీసులకు అప్పగించారు. 

వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన అండ్రు ఇంద్రారెడ్డి (38) నెల రోజులు క్రితం హన్మకొండలోని ఏకశిల పార్కుకు ఎదురుగా సిటీ హాస్పిటల్ పేరిట ఓ ఆస్పత్రిని ప్రారంభించాడు. రెండోసారి ఆడపిల్లలు వద్దనుకునే మహిళలను ఆర్ఎంపీలు, పీఎంపీల ద్వారా గుర్తిస్తున్నాడు. 

నర్సింగులో శిక్షణ పొందినవారి సహకారంతో యూట్యూబ్ చూస్తూ అబార్షన్లు చేస్తున్ాడు. దానిపై సమాచారం అందడంతో బుధవారం రాత్రి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఆస్పత్రిపై దాడి చేశారు. ఆ సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళలకు అతను చికిత్స చేస్తున్నాడు. అధికారులను చూసి వైద్య సిబ్బంది గోడ దూకి పారిపోయారు. థియేటర్ లో ఉన్న మహిళను బాత్రూంలో దాచిపెట్టారు. 

డీఎంహెచ్ఓ లలితాదేవి, అడిషనల్ డిఎంహెచ్ఓ మదన్ మోహన్ రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ యాకూబ్ పాషాలు పోలీసుల సాయంతో మహిళను బయటకు తీసుకుని వచ్చి విచారించారు రక్తస్రావం అవుతుండడంతో హన్మకొండ జీఎంహెచ్ కు తరలించారు డీఎంహెచ్ఓ ఫిర్యాదు మేరకు నకిలీ వైద్యుడిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

ఆస్పత్రిని జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు.  ఇంద్రారెడ్డి మూడేళ్ల క్రితం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో కూడా ఇలాంటి ఆస్పత్రినే ప్రారంభించాడు. దాన్ని అధికారులు అప్పట్లో సీజ్ చేశారు 

click me!