సూర్యాపేటలో గుప్తనిధుల కలకలం

Published : Apr 17, 2019, 11:39 AM IST
సూర్యాపేటలో గుప్తనిధుల కలకలం

సారాంశం

సూర్యాపేటలోని హుజూర్ మండలం అమరవరంలో గుప్త నిధుల కలకలం రేగింది. గుప్త నిధుల పేరుతో ఓ దొంగబాబా ప్రజలను మోసం చేశాడు. 

సూర్యాపేటలోని హుజూర్ మండలం అమరవరంలో గుప్త నిధుల కలకలం రేగింది. గుప్త నిధుల పేరుతో ఓ దొంగబాబా ప్రజలను మోసం చేశాడు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ ఓ వ్యక్తిని నమ్మించాడు. అర్థరాత్రి తవ్వితే దొరకుతాయని కూడా చెప్పాడు.

ఆ ఇంటి యజమాని నిజమని నమ్మాడు. అర్థరాత్రి పూట తవ్వకాలు ప్రారంభించి... ఓ మేకను తెచ్చి బలి కూడా ఇచ్చారు. నిధి దొరుకుతుందని మాయమాటలు చెప్పి..రూ.10లక్షలు వసూలు చేశాడు. ఆ డబ్బుతో నాణేలు తీసుకొచ్చి తవ్వకాల్లో బయటపడినట్టు ఆ ఇంటి యజమానిని నమ్మించాడు. 

అయితే.. బాబా వ్యవహార తీరు అనుమానం కలిగించడంతో..పోలీసులకు పిర్యాదు చేశాడు. రంగప్రవేశం చేసిన పోలీసులు 20 కేజీల నాణేలు స్వాధీనం చేసుకుని, దొంగబాబాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Hyderab IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌