భార్యపై కోపంతో ఇద్దరు పిల్లల్ని చంపాడు

Published : Apr 17, 2019, 11:35 AM ISTUpdated : Apr 17, 2019, 11:38 AM IST
భార్యపై కోపంతో ఇద్దరు పిల్లల్ని చంపాడు

సారాంశం

ఉమ్మడి మెదక్ జిల్లాలోని రామచంద్రాపురం వాంబే కాలనీలో దారుణం చోటు చేసుకొంది. భార్యపై  కోపంతో  ఎరుకల కుమార్ అనే వ్యక్తి తన  ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో పదేళ్ల మల్లీశ్వరీ అనే బాలిక సురక్షితంగా బయటపడింది. 


హైదరాబాద్:  ఉమ్మడి మెదక్ జిల్లాలోని రామచంద్రాపురం వాంబే కాలనీలో దారుణం చోటు చేసుకొంది. భార్యపై  కోపంతో  ఎరుకల కుమార్ అనే వ్యక్తి తన  ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో పదేళ్ల మల్లీశ్వరీ అనే బాలిక సురక్షితంగా బయటపడింది. 

అయితే పిల్లలను హత్య చేసిన తర్వాత తాను కూడ ఆత్మహత్య చేసుకోనేందుకు ప్రయత్నించిన  నిందితుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు.భార్య, భర్తల మధ్య గొడవల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లింది. ముగ్గురు పిల్లలు భర్త వద్దే ఉన్నారు. 

మంగళశారం రాత్రి ఏడేళ్ల అఖిల్, నాలుగేళ్ల శరణను కత్తితో పొడిచాడు.  పెద్ద కూతురు మల్లీశ్వరీ తనను చంపొద్దని వేడుకొంటున్న సమయంలో ఆమె మెడకు కత్తితో కోశాడు. అదే సమయంలో అతను కిందపడిపోయాడు. దీంతో ఆ బాలిక తలుపు తీసి ఇరుగుపొరుగు వారిని నిద్ర లేపింది.స్థానికులు కుమార్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు.


 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu