అద్దెకు ఉంటున్న యువకుడితో వివాహేతర సంబంధం.. హత్య చేసి, పారిపోయి.. చివరకు..

Published : May 03, 2022, 09:36 AM IST
అద్దెకు ఉంటున్న యువకుడితో వివాహేతర సంబంధం.. హత్య చేసి, పారిపోయి.. చివరకు..

సారాంశం

ఇద్దరు యువకులతో ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది తట్టుకోలేక ఒకరి మీద ఒకరు దాడికి తెగబడ్డారు. ఈ నేపథ్యంలో ఒకరు మరొకరిని రాయితో కొట్టడంతో చనిపోయాడు. 

హైదరాబాద్ : ఓ మహిళతో extramarital affair కారణంగా ఓ యువకుడిని murder చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలియడంతో అతను నేరుగా courtలో లొంగిపోయాడు. నిందితుడిని కస్టడీలో తీసుకున్న పోలీసులు ఆదివారం సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సిఐ శ్రీధర్ కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సాతంరాయి ప్రాంతానికి చెందిన ఓ మహిళ  భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది. ఆమె ఇంట్లో బీహార్కు చెందిన రాహుల్ అద్దెకు ఉండేవాడు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఆ తర్వాత కొన్నాళ్లకు సదరు మహిళ ఇంటిని ఖాళీ చేసి తొండుపల్లికి మకాం మార్చింది. ఈ క్రమంలో ఆమెకు బీహార్కు చెందిన రేణు అలియాస్ రాను అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కూడా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే సాతంరాయిలో ఉంటున్న రాహుల్ తరచూ సదరు మహిళను కలవడంతో పాటు ఫోన్ లో మాట్లాడేవాడు. దీనిని గమనించిన రేణు అతనితో గొడవ పడ్డాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు జోక్యం చేసుకుని ఇద్దరిని హెచ్చరించి పంపించారు. నిరుడు డిసెంబర్ లో  కొండపల్లి కి వచ్చిన రాహుల్ సమీపంలోని రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళ్తున్నాడు.  దీనిని గుర్తించిన అతడిని వెంబడించి వెనకనుంచి రాయితో తలపై గట్టిగా కొట్టడంతో ట్రాక్ మధ్యలో బోర్లా పడిపోయాడు. రాహుల్ చనిపోయినట్లు  గుర్తించిన రేణు  బీహార్ కు పారిపోయాడు.

కేసు మార్పిడితో…
అప్పట్లో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గత నెల ఈ కేసును రైల్వే పోలీసులు శంషాబాద్ పీఎస్ కు బదిలీ  చేయడంతో దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రేణు కోసం బీహార్ వెళ్లగా అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులు తనను అరెస్టు చేస్తారని భావించిన రేణఉ ఏప్రిల్ 25న రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయాడు. కోర్టు అనుమతితో రేణును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించారు. ఆదివారం సంఘటనా స్థలం వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు.  తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ఆ తర్వాత అతడిని కోర్టులో హాజరు పరిచారు. 

కాగా, మరో ఘటనలో Rental house కావాలని ఇంట్లోకి ప్రవేశించిన ఓ couple.. అసహ్యమైన పనులు చేస్తూ యజమానికి అడ్డంగా దొరికిపోయారు. గది వదిలి బయటకు పరుగులు తీసి బైక్ పై పారిపోయారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బి.కె గూడాలో ఓ ఇంటికి  Tolet board ఉండడంతో ఓ జంట అక్కడికి వచ్చారు. తాము భార్యాభర్తలమని అద్దె ఇల్లు కావాలని అడిగారు.  ఇల్లు చూస్తామని రెండవ అంతస్తులోని గదిలోకి వెళ్లిన జంట ఎంతకూ కిందికి రాకపోవడంతో యజమాని పైకి వెళ్ళాడు.

అద్దెకు ఇచ్చే గది తలుపు తీసి చూసి కంగుతిన్నాడు. లోపల  జంట  సరససల్లాపాల్లో మునిగి వుండటం చూసి గట్టిగా మందలించాడు. వెంటనే ఆ ఇద్దరు కిందికి పరుగుతీశారు. యువతి రోడ్డుపై పరిగెత్తగా, ఆమె వెనకే యువకుడు బైక్ తీసుకుని ఉడాయించాడు. సీసీ కెమెరా ఫుటేజ్ లో నమోదైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. యజమాని సీసీ ఫుటేజీ లతో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి  ఫిర్యాదు చేశాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu