ఈడీ వేధిస్తోంది, చంద్రబాబును ఇరికించాలని చూస్తున్నారు: రేవంత్ రెడ్డి ఆరోపణలు

By Nagaraju penumalaFirst Published Feb 20, 2019, 7:54 PM IST
Highlights

ఓటుకు నోటు కేసుకు సంబంధించి గతంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు క్లీన్ చీట్ ఇచ్చినా ఈడీతో వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. గతంలో ఈ కేసులో ఆరోపణలను రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 

హైదరాబాద్: ఈడీ అధికారులు తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో రెండు రోజులపాటు ఈడీ విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈడీ అధికారులు అడిగిందే అడుగుతూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. తనపై ఐటీ అధికారులు పెట్టిన కేసులపై ఈడీ అధికారులు ఆరా తీశారని అన్నింటికి సమాధానం చెప్పానని తెలిపారు. 

ఓటుకు నోటు కేసుకు సంబంధించి గతంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు క్లీన్ చీట్ ఇచ్చినా ఈడీతో వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. గతంలో ఈ కేసులో ఆరోపణలను రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 

ఎలాగైనా కేసులో తనను, సీఎం చంద్రబాబు నాయుడును ఇరికించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం కలుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇకపోతే ఓటుకు నోటు కేసులో రెండు రోజులపాటు రేవంత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. 

అంతకు ముందు కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డిని, అతని తనయులను కూడా ఈడీ అధికారులు విచారించారు. వేం నరేందర్ రెడ్డి సైతం కేసులో ఇరికిచేందుకు కుట్ర జరుగుతోందని, కేంద్రం డైరెక్షన్లో విచారణ జరుగుతుందన్న అనుమానం వ్యక్తం చేశారు కూడా. 
 

click me!