ఎందులో చేరేది ఖరారు .. కానీ ఇప్పుడే చెప్పను, ఆ పార్టీదే అధికారం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

By Siva Kodati  |  First Published Jun 2, 2023, 9:43 PM IST

తాను ఏ పార్టీలో చేరేది నిర్ణయించుకున్నట్లు తెలిపారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తాను చేరబోయే పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. 


కేసీఆర్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ను గద్దె దించేవారికి తమ మద్ధతు వుంటుందన్నారు. తాము ఏ పార్టీలో చేరేది ఖరారు చేసుకున్నామని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అది ఏ పార్టీ అనేది త్వరలోనే వెల్లడిస్తామని.. ఈ రాక్షస పాలన ఐదు నెలలేనని ఆయన పేర్కొన్నారు. ఐదు నెలల్లో మీ సమస్యలు పరిష్కారం కాకుంటే తమ ప్రభుత్వం పరిష్కరిస్తామని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. కాంట్రాక్ట్ కార్మికులకు 8 గంటల పనివేళలు, శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు జరిగిన మేలు ఏం లేదని.. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదని శ్రీనివాస్ రెడ్డి దుయ్యబట్టారు. 

ALso Read: చేరికలపై ఈటల వ్యాఖ్యలు.. ఎవరొచ్చినా, రాకున్నా బీజేపీకి ఏం కాదు : తేల్చేసిన కిషన్ రెడ్డి

Latest Videos

ఇకపోతే.. తన భవిష్యత్తు  రాజకీయ  కార్యాచరణను జూన్ మాసంలో వెల్లడించనున్నట్టుగా  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  చెప్పారు. మంగళవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో  తెలగాణ రాష్ట్రంలో  బీఆర్ఎస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యంగా  ఆయన  పేర్కొన్నారు. ఈ విషయమై  తాము చర్చలు జరుపుతున్నామన్నారు. ఈ విషయమై  మేథోమథనం జరుగుతుందన్నారు. మరో  15 రోజుల పాటు  మేథో మథనం జరిగే అవకాశం ఉందన్నారు.  తమ లక్ష్యంలో  ఎలాంటి గందరగోళం లేదన్నారు.  తమ వ్యూహాలు తమకున్నాయని  జూపల్లి కృష్ణారావు  చెప్పారు.  కాంగ్రెస్, బీజేపీలలో  చేరాలని ఆ పార్టీల నుండి ఆహ్వానాలు అందిన విషయాన్ని  మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు  చెప్పారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తమతో చర్చలు జరిపిన  విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. 

click me!