కేసీఆర్ సన్నాసి అన్నది నన్ను కాదు, నాపేరు ఎక్కడా అనలేదు:లగడపాటి

By Nagaraju TFirst Published Nov 30, 2018, 9:55 PM IST
Highlights

 ఆంధ్రా అక్టోపస్ గా పేర్గాంచిన లగడపాటి రాజగోపాల్ తిరుపతిలో శుక్రవారం ఉదయం తెలంగాణలో స్వతంత్రుల వైపు ప్రజలు మెుగ్గుచూపుతన్నారంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే సర్వేపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై  లగడపాటి రాజగోపాల్ స్పందించారు. 

హైదరాబాద్: ఆంధ్రా అక్టోపస్ గా పేర్గాంచిన లగడపాటి రాజగోపాల్ తిరుపతిలో శుక్రవారం ఉదయం తెలంగాణలో స్వతంత్రుల వైపు ప్రజలు మెుగ్గుచూపుతన్నారంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే సర్వేపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై  లగడపాటి రాజగోపాల్ స్పందించారు. 

కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తన పేరును ప్రస్తావించలేదు కదా అంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలు తనను ఉద్దేశించినవి కావనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు తన టీం చేసిన సర్వేను వెల్లడించలేదన్నారు. నా పేరు ఎక్కడా అనలేదన్నారు. 

తాను ఇంకా సర్వే రిలీజ్ చెయ్యలేదని తెలిపారు. అయితే తన పేరుతో తప్పుడు సర్వేలు ప్రచారంలో ఉన్నాయని, వాటిని ఎవరూ నమ్మొద్దని లగడపాటి సూచించారు. రెండు నెలల క్రితం తన టీం చేసిన సర్వే టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఇచ్చాయన్నారు. 
  
డిసెంబర్‌ 7 తర్వాతే సర్వేను రిలీజ్ చేస్తానని ఆంధ్రా అక్టోపస్ స్పష్టం చేశారు. తన సర్వేను నమ్మేవాళ్లు నమ్ముతారు, నమ్మనివాళ్లు నమ్మరు అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా స్వతంత్ర అభ్యర్ధులిద్దరు గెలుస్తారంటూ తాను విడుదల చేసిన సర్వేపై రెండు పార్టీల సీనియర్‌ నాయకులు ఫోన్లు చేసినట్లు తెలిపారు. 

తాను చెప్పిన అంశం ఏ ఒక్కరూ తప్పని చెప్పలేదని చాలా మంది రెండూ కరెక్ట్ అన్నారని లగడపాటి చెప్పారు. అయితే శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ సర్వేలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కొంతమంది సన్నాసులు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు శాపాలు పెట్టారు. వాళ్లే ఇప్పుడు వెకిలి, మకిలి, పిచ్చి సర్వేలు విడుదల చేస్తున్నారు. వాటిని పట్టించుకోవద్దు. ఈ భూపాలపల్లి సభ చూస్తే చిల్లర సర్వేలన్నీ తప్పని తేలుతోందని వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు ఇకపోతే రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న మాటకు కట్టుబడి ఉన్నానని అందువల్లే రాజకీయాల్లోకి రావడం లేదన్నారు. బీజేపీలో చేరాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కోరినా తాను వెళ్లేందుకు ఒప్పుకోలేదని రాజగోపాల్ అన్నారు. 

తెలంగాణ ప్రజలంటే నాకిష్టమని అందుకే కలిసుండాలని కోరుకున్నాని తన మనసులో మాట చెప్పారు. ఒక వేళ పోటీ చేయాలనుకుంటే తెలంగాణ నుంచే పోటీ చేస్తానన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆగస్టు నుంచి తెలంగాణ రాజకీయాలను అధ్యయనం  చేస్తున్నా ఓటరు నాడి పట్టడం అతికష్టంగా మారిందని లగడపాటి అన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నేను చెప్పిన స్వతంత్రుల అంశం నిజమే:లగడపాటి

లగడపాటివి వెకిలి సర్వేలు, ప్రజలు ఆగం కావొద్దు:కేసీఆర్

తెలంగాణలో స్వతంత్రులే కింగ్‌మేకర్లు: లగడపాటి సంచలన సర్వే

 

click me!