వరంగల్ లో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ: చెప్పులతో కొట్టుకున్న రెండు వర్గాలు

By narsimha lode  |  First Published May 31, 2023, 1:08 PM IST

వరంగల్ డీసీసీ అధ్యక్షురాలిగా  ఎర్రబెల్లి స్వర్ణ  ప్రమాణ  స్వీకారోత్సవ  కార్యక్రమంలో  గందరగోళం  చోటు  చేసుకుంది.


వరంగల్:  కాంగ్రెస్  పార్టీ  వరంగల్ జిల్లా  అధ్యక్షురాలిగా  ఎర్రబెల్లి స్వర్ణ  ప్రమాణస్వీకారోత్సవంలో  గందరగోళం  నెలకొంది.    రెండు వర్గాలుగా  విడిపోయిన  కాంగ్రెస్  కార్యకర్తలు   చెప్పులతో  కొట్టుకున్నారు.  బుధవారంనాడు  కాంగ్రెస్  పార్టీ  వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా  ఎర్రబెల్లి  స్వర్ణ  ప్రమాణం  చేశారు.  ఈ ప్రమాణ స్వీకారోత్సవ  కార్యక్రమంంలో     రెండు వర్గాలుగా  విడిపోయిన  కాంగ్రెస్ కార్యకర్తలు  గొడవకు దిగారు.  చెప్పులతో కొట్టకున్నారు.

  ఓ నేతను  వేదికపైకి  వెళ్లే సమయంలో  ప్రత్యర్ధి వర్గానికి  చెందిన వారు   గొడవకు దిగారు.  దీంతో  రెండు వర్గాల  మధ్య ఘర్షణ  చోటు  చేసుకుంది.   రెండు వర్గాల  నేతలు  పరస్పరం  దాడి  చేసుకున్నారు.  వేదికపైకి వెళ్లే  ఓ నేతను  కులం పేరుతో  ప్రత్యర్ది వర్గానికి  చెందిన  మరొకరు దూషించడంతో  ఘర్షణ  మొదలైంది.కాంగ్రెస్  పార్టీకి  చెందిన  ఇద్దరు నేతల మధ్య  వ్యక్తిగత  విబేధాల  కారణంగా  గొడవ  జరిగిందని  ఆ పార్టీ  నేతలు  చెబుతున్నారు.

Latest Videos

ఈ సమయంలో  కాంగ్రెస్ పార్టీ  వరంగల్  జిల్లా  అధ్యక్షుడు ఎర్రబెల్లి  స్వర్ణ భర్త  రాజేశ్వరరావు  జోక్యం  చేసుకున్నారు.  ఇరు వర్గాలను  శాంతింప చేశారు. పార్టీ వ్యతిరేక  కార్యక్రమాలకు  పాల్పడే వారిపై  చర్యలు తీసుకుంటామని  కాంగ్రెస్  పార్టీ  నాయకులు  హెచ్చరించారు. 

వరంగల్ డీసీసీ  అధ్యక్ష పదవిని   కొండా  మురళి  దంపతులు తమ వర్గానికి  చెందిన నేతకు కట్టబెట్టే  ప్రయత్నం  చేశారు.  అయితే   పార్టీ నాయకత్వం  ఎర్రబెల్లి స్వర్ణకు  అప్పగించింది.   ఈ విషయమై  తమకు  సహకరించాలని  కొండా మురళి దంపతులకు  ఎర్రబెల్లి స్వర్ణ  దంపతులు  కోరారు.  ఇందుకు  కొండా దంపతులు  గ్రీన్ సిగ్నల్  ఇచ్చారు. దీంతో  వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని  ఓ ఫంక్షన్ హల్ లో  ఎర్రబెల్లి స్వర్ణ  ప్రమాణస్వీకారోత్సవ  కార్యక్రమం  ఏర్పాటు  చేశారు.   అయితే  ఈ కార్యక్రమంలో  ఇద్దరు  నేతల  మధ్య  వ్యక్తిగత  గొడవ కారణంగా  ఘర్షణ జరిగిందని  ఆ పార్టీ నేతలు  చెబుతున్నారు.

click me!