బర్కత్‌పుర ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలి: కిషన్ రెడ్డి డిమాండ్

By Arun Kumar PFirst Published Feb 6, 2019, 4:34 PM IST
Highlights

హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే ఓ ఉన్మాది దాడి గురైన మధులిమను అంబర్ పేట మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పరామర్శించారు. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న యువతితో పాటు ఆమె కుటుంబానికి అండగా వుంటానని కిషన్ రెడ్డి ప్రకటించారు. సభ్య సమాజం తలదించుకునేలా, మానవత్వ విలువలను దెబ్బతీసేలా జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 
 
అమాయక యువతిపై దాడికి పాల్పడి ఆమె ప్రాణాపాయ స్థితిలో వుండటానికి కారణమైన నిందితున్ని తీవ్రంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటి నుండి బయటకు వెళ్లిన అమ్మాయిలు మళ్లీ ఇంటికి క్షేమంగా తిరిగివచ్చే వరకు నమ్మకం లేకుండా పోతుందని అన్నారు. ఇలాంటి ఘటనలు జరక్కుంగా సమాజంలో ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యత వహించాలని కిషన్ రెడ్డి తెలిపారు.  

 ఇంటర్మీడియట్ చదువుతున్న మధులిమ అనే యువతిపై భరత్ అనే ప్రేమోన్మాది దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్న సదరు యువకుడు ఇవాళ ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాలేజీకి వెళ్తున్న మధులిమను మార్గ మధ్యలో అడ్డుకున్న నిందితుడు కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన మధులిమ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

మధులిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని యశోధ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌పై మధులికకు చికిత్స అందిస్తున్నట్టు యశోధ వైద్యులు  ప్రకటించారు.మధులిక ప్రస్తుతం కోమాలో ఉందని వైద్యులు చెప్పారు. మధులిక కుటుంబ సభ్యులను అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కూడా పరామర్శించారు.  

సంబంధిత వార్తలు

మధులికపై దాడి చేసిన భరత్ అరెస్ట్  మధులిక పరిస్థితి విషమం: 72 గంటలు అబ్జర్వేషన్

హైదరాబాద్‌లో నడిరోడ్డు మీద యువతిపై ప్రేమోన్మాది దాడి

click me!