బీఆర్ఎస్ కు మాజీమంత్రి తుమ్మల రాజీనామా...

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను కేసీఆర్ కు పంపారు. 

Google News Follow Us

హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసిఆర్ కు రాజీనామా లేఖ పంపారు. పార్టీలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రకటించిన మొదటి జాబితాలో తుమ్మలకు టికెట్ రాకపోవడం తెలిసిన విషయమే. దీంతో ఆయన గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. 

పార్టీకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేస్తారని కొంతకాలంగా చక్కర్లు కొడుతున్న వార్తలు దీంతో నిజమయ్యాయి. ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. నేటినుంచి హైదరాబాద్ లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో శనివారంనాడు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

మొదట సెప్టెంబర్ 17న తుమ్మల కాంగ్రెస్‌లో చేరుతారని వార్తలు వినిపించాయి. కానీ శనివారం సెప్టెంబర్ 16నే ఆయన హస్తం తీర్ధం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 

Read more Articles on