తెలంగాణలో బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది.. ప్రజల అభిప్రాయం ఇదే: మాజీ మంత్రి జూపల్లి

Published : Jun 21, 2023, 01:28 PM IST
తెలంగాణలో బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది.. ప్రజల అభిప్రాయం ఇదే: మాజీ మంత్రి జూపల్లి

సారాంశం

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  కాంగ్రెస్‌లో  చేరికకు రంగం  సిద్దమైంది. మరికాసేపట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు.. జూపల్లి కృష్ణారావు నివాసారికి వచ్చి కాంగ్రెస్‌ పార్టీలో చేరాల్సిందిగా ఆయనను ఆహ్వానించనున్నారు.

హైదరాబాద్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  కాంగ్రెస్‌లో  చేరికకు రంగం  సిద్దమైంది. మరికాసేపట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు.. జూపల్లి కృష్ణారావు నివాసారికి వచ్చి కాంగ్రెస్‌ పార్టీలో చేరాల్సిందిగా ఆయనను ఆహ్వానించనున్నారు. ఈ క్రమంలోనే జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ భూ స్థాపితం అవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇదే అభిప్రాయంతో ఉన్నారని.. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆ నైతిక అర్హత కూడా కోల్పోయిందని విమర్శించారు. తనను కలిసేందుకు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిలు వస్తున్నారని.. వారు ఎందుకు వచ్చారో తెలుసుకుని ఆ తర్వాత తాను మీడియాతో మాట్లాడతానని చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు