ప్రాణాలకు తెగించడం అంటే ఇదే... సీఐపై హరీష్ ట్వీట్

By telugu teamFirst Published May 29, 2019, 12:49 PM IST
Highlights


తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు...  సీఐ సృజన్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల సీఐ సృజన్ రెడ్డి ప్రాణాలకు తెగించి మరీ ఇద్దరిని  కాపాడారు. కాగా... దీనిపై హరీష్ రావు స్పందించారు.

తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు...  సీఐ సృజన్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల సీఐ సృజన్ రెడ్డి ప్రాణాలకు తెగించి మరీ ఇద్దరిని  కాపాడారు. కాగా... దీనిపై హరీష్ రావు స్పందించారు.

'ప్రజలకోసం ప్రాణాలకు తెగించడం అంటే ఇదే. ఇటువంటి ధైర్యసాహసాలు మొత్తం పోలీసు శాఖకే గౌరవం తీసుకువస్తాయి. జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డిగారు .. మిమ్మల్ని చూసి పోలీసు శాఖే కాదు, మొత్తం తెలంగాణ సమాజం గర్విస్తోంది. మీ సాహసం మరెందరికో స్ఫూర్తిగానిలవాలి. మీకు నా శాల్యూట్' అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే... కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి  చెందిన ఓ వ్యక్తి ఇంటి సమీపంలో ఉన్న చేదబావిలో మట్టి పూడిక తీత పనులు చేపట్టారు. పూడికి తీయడానికి బావిలోకి దిగిన మలయ్య, రవీందర్ అనే వ్యక్తిలో బావిలో చిక్కుకుపోయారు. వెంటనే గ్రామస్థులు పోలీసులకు, 108కి సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న సీఐ సృజన్ రెడ్డి నిచ్చెన సహాయంతో బావిలోకి దిగి... ఆ ఇద్దరినీ క్షేమంగా బయటకు తీసుకు వచ్చాడు. తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా కూడా.. బావిలోకి దిగి ఆ ఇద్దరినీ కాపాడటంపై సీఐ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయన వెంటనే రక్షించకపోయి ఉంటే.. ఊపిరాడక వాళ్లు ప్రాణాలుకోల్పోయేవారని వైద్యులు తెలిపారు. ఈ ఘటన మీడియా ద్వారా బయటకు రావడంతో.. హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. 

related news..

ప్రాణాలకు తెగించిమరీ ఇద్దరు యువకులను కాపాడిన పోలీస్...(వీడియో)

click me!