టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి చేదు అనుభవం.. కాన్వాయ్‌ని ఆపి నిలదీసిన గిరిజనులు

Siva Kodati |  
Published : Jul 24, 2021, 03:32 PM ISTUpdated : Jul 24, 2021, 03:34 PM IST
టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి చేదు అనుభవం.. కాన్వాయ్‌ని ఆపి నిలదీసిన గిరిజనులు

సారాంశం

జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని గిరిజనులు అడ్డుకున్నారు. తమ గ్రామానికి రోడ్డు వేస్తామని చెప్పి.. ఇంత వరకు వేయలేదని నిలదీశారు.  

జనగామ జిల్లాలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పర్యటనను స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. నర్మెట్ట మండలం మచ్చుపహాడ్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మొక్కలు నాటేందుకు వెళ్తుండగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు  రత్నతండా వాసులు. తమ గ్రామానికి రోడ్డు వేస్తామని చెప్పి.. ఇంత వరకు వేయలేదని నిలదీశారు. దీంతో పోలీసులకు గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు