కొప్పుల ఈశ్వర్ పై మాజీమంత్రి శ్రీధర్ బాబు ఫైర్: సభాహక్కుల నోటీసులిస్తానని వార్నింగ్

By Nagaraju penumalaFirst Published Nov 13, 2019, 6:03 PM IST
Highlights

ఈ వైఖరి చూస్తుంటే తమ మంథని గ్రామంపైనా, నియోజకవర్గం పైనా ముఖ్యమంత్రి కేసీఆర్, సింగరేణి యాజమాన్యం, మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఎంత చిన్న చూపో తెలుస్తోందని శ్రీధర్ బాబు తెలిపారు.  
 

హైదరాబాద్: సింగరేణి యాజమాన్యంపైని, మంత్రి కొప్పుల ఈశ్వర్ పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు మంథని ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు. సింగరేణి యాజమాన్యం ఒత్తిడులకు తలొగ్గి ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.  

సింగరేణిపై ఎమ్మెల్యేలు, ఎంపీలతో రివ్యూ సమావేశానికి తనను పిలకపోవడానికి కారణమేంటో చెప్పాలని దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిలదీశారు. తనను పిలవకుండా ఒక రిసార్ట్స్ లో సమావేశం ఎందుకు నిర్వహిస్తారని ప్రశ్నించారు. 

సింగరేణి ప్రాంతానికి చెందిన ప్రజలు దుబ్బకు, ధూళికి గురై తమ గ్రామాల్లో ఉంటున్న ప్రాంత వాసుల సమస్యలను చర్చించే అవకాశం ఇవ్వలేదన్నారు. సింగరేణి ప్రాంత సమస్యలు ప్రస్తావించడానికి అవకాశం ఎందుకు ఇవ్వలేదంటూ కొప్పుల ఈశ్వర్ ని కడిగి పారేశారు. 

తనపై రాష్ట్రప్రభుత్వానికి కొద్దో గొప్పో వ్యతిరేకత ఉండవచ్చునని కానీ ప్రజల సమస్యలపై చర్చించేందుకు అవకాశం ఇవ్వకూడనంత కక్ష ఉండటం సరికాదన్నారు. సింగరేణి సీఎండీ రాజకీయాల ఒత్తిడికి తలొగ్గి పిలవలేదా...సింగరేణి ప్రాంతాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర డైరెక్టర్లు, జీఎంలతో మీటింగ్ జరుగుతుంటే తమను పిలవరా అంటూ మండిపడ్డారు. 

ఈ వైఖరి చూస్తుంటే తమ మంథని గ్రామంపైనా, నియోజకవర్గం పైనా ముఖ్యమంత్రి కేసీఆర్, సింగరేణి యాజమాన్యం, మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఎంత చిన్న చూపో తెలుస్తోందని శ్రీధర్ బాబు తెలిపారు.  

తమ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల తరపున సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వానికి తెలియజేసేందుకు ప్రయత్నిస్తే దాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ పరోక్షంగా అడ్డుకున్నారని తెలిపారు. దానిపై ప్రజలకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. 

సింగరేణి యాజమాన్యంతో మంత్రి నిర్వహించిన సమావేశానికి తనను పిలకపోవడం, సింగరేణి మీటింగ్ హాల్ లో లేదా మంత్రి చాంబర్ లో సమావేశం నిర్వహించకుండా రిసార్ట్ లో నిర్వహించడంపై మండిపడ్డారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ తన హక్కులకు భంగం కల్పించారని ఈ నేపథ్యంలో స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని మాజీమంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

సింగరేణి కార్మికులకు తీపికబురు: దీపావళికి భారీ బోనస్

click me!