ఉత్తమ్‌ వల్లే కూలిన యుద్దవిమానాలు...500 కోట్ల నష్టం: మాజీ సైనికుడి సంచలన

By Arun Kumar PFirst Published Oct 9, 2018, 7:21 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఓ మాజీ సైనికుడు సంచలన ఆరోపణలు చేశారు. 1979 లో ఉత్తమ్ తో పాటు తాను ఆదంపూర్ లో ఎయిర్ క్రాఫ్ట్ లో టెక్నీషియన్ గా పనిచేసిన బోయినపల్లి ప్రభాకర్ రావు తెలిపారు. ఈ సమయంలో ఉత్తమ్ నిర్లక్ష్యం వల్ల దాదాపు రూ.500కోట్ల విలువైన రెండు ఎయిర్ క్రాఫ్ట్ లు ప్రమాదానికి గురయ్యాయని ప్రభాకర్ రావు ఆరోపించారు. 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఓ మాజీ సైనికుడు సంచలన ఆరోపణలు చేశారు. 1979 లో ఉత్తమ్ తో పాటు తాను ఆదంపూర్ లో ఎయిర్ క్రాఫ్ట్ లో టెక్నీషియన్ గా పనిచేసిన బోయినపల్లి ప్రభాకర్ రావు తెలిపారు. ఈ సమయంలో ఉత్తమ్ నిర్లక్ష్యం వల్ల దాదాపు రూ.500కోట్ల విలువైన రెండు ఎయిర్ క్రాఫ్ట్ లు ప్రమాదానికి గురయ్యాయని ప్రభాకర్ రావు ఆరోపించారు. 

ఉత్తమ్ ఎప్పుడూ ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలుకుతాడని ప్రభాకరరావు తెలిపారు. తనకు పదహారేళ్ళ వయసున్నపుడే ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యానని ఆయన చెప్పుకుంటారు కానీ ఆయన కెరీర్ అంతా గందరగోళం అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన దేశానికి సేవ చేసిందేమీ లేదన్నారు.  

1979లో పంజాబ్ లోని ఆదంపూర్ లో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ గా తాను పని చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్లైట్ లెఫ్టినెంట్ గా పనిచేసేవారని ఆయన తెలిపారు. తాను మంచిపేరు తెచ్చుకున్న పైలట్ గా, కెప్టెన్ గా ఉత్తమ్ చెప్పుకుంటారని... కానీ వాస్తవానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కెప్టెన్ అనే పదవే ఉండదని తెలిపారు. బ్రిటిష్ ఆర్మీలో మాత్రమే ప్లైట్ కెప్టెన్ అని పిలుస్తారని ఆయన తెలిపారు. ఉత్తమ్ ప్లైట్ లెఫ్టినెంట్ గా మాత్రమే పనిచేశారని ప్రభాకరరావు తెలిపారు. 

ఎయిర్ క్రాఫ్ట్ లను సరిగా నడవలేని వాడు కాంగ్రెస్ పార్టీని ఎలా నడుపుతాడు అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులకు ప్రభాకర్ రావు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కించపరిచేలా మాట్లాడారని, ఆయన నోటిదురుసు తగ్గించుకోక పోతే మాజీ సైనికులంతా కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంగతి చూసుకుంటామని ప్రభాకర్ రావు హెచ్చరించారు. ఆయన వెళ్లిన ప్రతి చోటికల్లా వెళ్లి ఆయన బండారాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు.

ఎయిర్ క్రాఫ్ట్ లు క్రాష్ అయినప్పుడు పారాచూట్ల సహాయంతో సురక్షితంగా బయటపడతారన్నారు. అయితే లైఫ్ సేఫ్ గార్డ్ అయిన పారాచూట్‌ని వినియోగించడంలో ఆయనకు అనుభవం లేక వెన్నెముకకు దెబ్బ తగిలింది అన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ లా క్రాష్ విషయంలో ఉత్తమ్ మూడు నెలల పాటు విచారణను ఎదుర్కొన్నారని ప్రభాకర్ రావు వివరించారు. విచారణ అధికారులను మేనేజ్ చేసుకుని రాష్ట్రపతి భవన్లో ఏడీసీ గా ఉద్యోగం సంపాదించాలని తొమ్మిదేళ్ల పాటు అక్కడ పని చేశారన్నారు.

click me!