మేం చిన్న మనుషులమే.. అయనో మేధావి, పెద్ద మనిషి : కేసీఆర్ వ్యాఖ్యలపై ఈటల కౌంటర్

By Siva KodatiFirst Published Jul 24, 2021, 9:38 PM IST
Highlights

కొట్లాడేవాళ్ళంతా కేసీఆర్‌కు చిన్న మనుషులేనని.. ఆయన పెద్ద మేధావి, పెద్ద మనిషి అనుకుంటున్నారని ఈటల రాజేందర్ సెటైర్లు వేశారు. కానీ చలి చీమల చేత చిక్కి చావదే సుమతి అన్న మాటను రాజేందర్ గుర్తుచేశారు.

తనపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. పాదయాత్రలో భాగంగా శనివారం ఇళ్ళందకుంట మండలం కనగర్తి గ్రామంలో రాజేందర్ మాట్లాడుతూ.. దళిత బంధుపై కేసీఆర్ హుజురాబాద్‌లోని ఓ పిల్లాడితో మాట్లాడాడంటూ సెటైర్లు వేశారు. అతను ఈటెల రాజేందర్ పేరెత్తగానే.. కేసీఆర్ ఎదో చిన్న మనిషి అంటున్నారంటూ మండిపడ్డారు. కొట్లాడేవాళ్ళంతా కేసీఆర్‌కు చిన్న మనుషులేనని.. ఆయన పెద్ద మేధావి, పెద్ద మనిషి అనుకుంటున్నారని ఈటల సెటైర్లు వేశారు. కానీ చలి చీమల చేత చిక్కి చావదే సుమతి అన్న మాటను రాజేందర్ గుర్తుచేశారు.

ALso Read:అయ్యేది లేదు.. సచ్చేది లేదు: ఈటల ఎపిసోడ్‌పై తొలిసారి స్పందించిన కేసీఆర్

మంత్రి అనేటోడికి దరఖాస్తు ఇస్తే చిటికెలో పని అయిపోవాలన్నారు. గతంలో ఎంపీపీ, సర్పంచ్‌లు ప్రతి పాదిస్తే పెన్షన్లు వచ్చేవని రాజేందర్ గుర్తుచేశారు. కానీ ఇప్పుడు మంత్రి ఫోన్ చేసినా రావడం లేదని.. అక్కడ కేసీఆర్ తాళం వేసి పెట్టారంటూ ఈటల ఎద్దేవా చేశారు. ఇవాళ సర్పంచ్, ఎమ్మార్వో, కలెక్టర్ ఎవరు రికమెండ్ చేసినా పెన్షన్లు వచ్చే పరిస్థితి లేదని రాజేందర్ అన్నారు. చివరికి మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ చెప్పినా పని కాదంటూ వ్యాఖ్యానించారు. మూడేళ్లుగా తాళం వేసిన కేసీఆర్.. నేను రాజీనామా చేసిన తర్వాత 11 వేల పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు. 

click me!