24 గంటల్లో 647 మందికి కరోనా పాజిటివ్... తెలంగాణలో 6,40,659కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Jul 24, 2021, 09:00 PM IST
24 గంటల్లో 647 మందికి కరోనా పాజిటివ్... తెలంగాణలో 6,40,659కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 647 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతి చెందారు. 749 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 9,625 యాక్టివ్‌ కేసులు వున్నాయి.   

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,20,213 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 647 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 6,40,659కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న వైరస్ సోకి ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 3,780కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 749 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 9,625 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

తాజాగా కోలుకున్న వారితో కలిపి ఇప్పటి వరకు 6,27,254 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో రికవరీ రేటు 97.90 శాతం ఉండగా.. మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 2,12,24,462 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 24, జీహెచ్ఎంసీ 81, జగిత్యాల 21, జనగామ 7, జయశంకర్ భూపాలపల్లి 8, గద్వాల 3, కామారెడ్డి 4, కరీంనగర్ 76, ఖమ్మం 58, మహబూబ్‌నగర్ 16, ఆసిఫాబాద్ 4, మహబూబాబాద్ 5, మంచిర్యాల 24, మెదక్ 4, మేడ్చల్ మల్కాజిగిరి 31, ములుగు 5, నాగర్ కర్నూల్ 3, నల్గగొండ 39, నారాయణపేట 1, నిర్మల్ 1, నిజామాబాద్ 5, పెద్దపల్లి 42, సిరిసిల్ల 15, రంగారెడ్డి 26, సిద్దిపేట 16, సంగారెడ్డి 5, సూర్యాపేట 32, వికారాబాద్ 2, వనపర్తి 6, వరంగల్ రూరల్ 14, వరంగల్ అర్బన్ 47, యాదాద్రి భువనగిరిలో 18 చొప్పున కేసులు నమోదయ్యాయి.  
 

 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే