లోకేష్..హుందాగా మాట్లాడటం నేర్చుకో...ఈటల

Published : Sep 07, 2018, 01:50 PM ISTUpdated : Sep 09, 2018, 12:05 PM IST
లోకేష్..హుందాగా మాట్లాడటం నేర్చుకో...ఈటల

సారాంశం

మంత్రి పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా, హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలని సూచించారు.    

ఏపీ మంత్రి లోకేష్ పై తెలంగాణ  ఆపద్దర్మ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. కాస్త హుందాగా మాట్లాడటం నేర్చుకోమని హితవు పలికారు. నేడు టీఆర్‌ఎస్‌ పార్టీ హుస్నాబాద్‌లో తలపెట్టిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. లోకేష్‌ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా, హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలని సూచించారు.  

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రజాకార్ల రాజ్యం అవుతుందని, నక్సలైట్ల రాజ్యం అవుతుందని, కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందన్న ఆంధ్ర నాయకులు ఏమయ్యారో ప్రజలకు తెలుసని ఈటెల మండిపడ్డారు. ప్రశాంతమైన అభివృద్ది ప్రాంతంగా తెలంగాణ విరాజిల్లుతుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల మెప్పుపొందిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు