కేసీఆర్‌పై లోకేశ్ వ్యాఖ్యలు.. ఏపీమంత్రిపై విరుచుకుపడ్డ ఈటల

By sivanagaprasad KodatiFirst Published Sep 7, 2018, 1:21 PM IST
Highlights

టీఆర్ఎస్ అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై అపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. 

టీఆర్ఎస్ అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై అపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. హుస్నాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. లోకేశ్ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని.. బాధ్యాతయుతమైన మంత్రి పదవిలో ఉన్నప్పుడు హుందాగా ఉండటం నేర్చుకోవాలని సూచించారు.

ఏపీ నుంచి తెలంగాణ విడిపోతే రాష్ట్రం అంధకారం అవుతుందని.. రజాకార్ల రాజ్యం అవుతుందని.. నక్సలైట్ల రాజ్యం అవుతుందని కొందరు ఆంధ్ర నాయకులు అన్నారని.. వారంతా ఏమయ్యారో ప్రజలకు తెలుసునని ఈటల ఎద్దేవా చేశారు.. ప్రశాంత వాతావరణంలో తెలంగాణ అభివృద్ధి చెందిన ప్రాంతంగా విరాజిల్లుతుందని.. అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారని.. అలాంటి కేసీఆర్‌ నాయకత్వంపై విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన నారా లోకేశ్.. కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌లో ఎంతమంది టీడీపీ వాళ్లు ఉన్నారో అందరికీ తెలుసునని.. తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని అంటూనే.. జాగో, బాగో అంటూ కేసీఆర్ కామెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్ర ఓట్లు పడకుండానే జీహెచ్ఎంసీ పీఠాన్ని టీఆర్ఎస్ దక్కించుకోగలిగిందా అని లోకేశ్ ప్రశ్నించారు.

click me!