కేసీఆర్ ఆగ్రహం: ఈటెల రాజేందర్ మంత్రి పదవికి గండం?

By narsimha lodeFirst Published Aug 26, 2019, 10:41 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. రెవిన్యూ అధికారుల బృందానికి రహస్య సమాచారాన్ని లీక్ చేశారని  ఆయనపై అపవాదు ఉంది.దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహనికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు.

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. రెవిన్యూ అధికారుల బృందానికి రహస్య సమాచారాన్ని లీక్ చేశారని  ఆయనపై అపవాదు ఉంది.దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహనికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు.

ఈ విషయమై వార్తలు ప్రచారం కావడంతో టీఆర్ఎస్ లో రకరకాల ఊహగానాలు విన్పిస్తున్నాయి.ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో  రెవిన్యూ శాఖలో అవినీతిని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకు వచ్చే విషయమై సీఎం కేసీఆర్ చర్చించారు. 

కొత్త చట్టం ఎలా ఉండాలనే దానిపై ఆయన సమావేశంలో చర్చించారు.ఈ విషయమై బయట ఎవరూ కూడ చెప్పకూడదని సీఎం ఈ సమావేశంలో పాల్గొన్న వారికి సూచించారు.

కలెక్టర్ల సమావేశంలో జరిగిన చర్చ గురించి ఎలాంటి సమాచారం బయటకు రాకపోవడంతో రెవిన్యూ అసోసియేషన్ అధికారుల బృందం మంత్రి ఈటల రాజేంందర్ ను కలుసుకొన్నారు. రెవిన్యూ శాఖను  రద్దు చేయడం లేదా పంచాయితీరాజ్ విభాగంలో రద్దు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వంలో ఉందనే సమాచారం తెలుసుకొన్నారని ప్రచారం సాగుతోంది.దీంతో రెవిన్యూ అసోసియేషన్ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఈ విషయమై రెవిన్యూ అధికారులు మంత్రి ఈటల రాజేందర్ తో ఈ విషయమై చర్చించారని ఇంటలిజెన్స్ అధికారులు సీఎం కేసీఆర్ కు సమాచారం ఇచ్చారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

కొత్త రెవిన్యూ చట్టంలో ప్రతిపాదించిన అంశాలతో పాటు తప్పు చేసిన అధికారులపై ఏ రకమైన శిక్షలు ఉంటాయనే విషయాలపై మంత్రి రెవిన్యూ అధికారులకు వివరించినట్టుగా ఇంటలిజెన్స్ అధికారులు సీఎం కేసీఆర్ కు సమాచారం ఇచ్చారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.దీంతో సీఎం కేసీఆర్ ఈటెల‌పై ఆగ్రహంతో ఉన్నట్టుగా  టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన సామాజిక వర్గాల్లో ముఖ్యమైన ముదిరాజ్ వర్గానికి చెందినవాడు ఈటల రాజేందర్. దీంతో  ఈటల రాజేందర్ ను రెండో దఫా కూడ మంత్రివర్గంలోకి తీసుకొన్నట్టుగా టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

కొత్త రెవిన్యూ చట్టం విషయంలో రెవిన్యూ అసోసియేషన్  నేతలు, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్, రెవిన్యూ సర్వీసెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్  విలేజ్ రెవిన్యూ ఆఫీసర్స్ , రెవిన్యూఅసిస్టెంట్స్ అసోసియేషన్  మాత్రం ఈ విషయమై నష్టనివారణకు దిగారు.కొత్త రెవిన్యూ చట్టం విషయంలో  మంత్రి ఈటల రాజేందర్  తమతో చర్చించలేదని స్పష్టం చేశారు.

రెవిన్యూ అసోసియేషన్ నేతలు వి. అచ్చిరెడ్డి, వి. రవీందర్ రెడ్డి, కె. గౌతం కుమార్  తదితరులు ఇటీవల తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిశారు. రెవిన్యూ ఉద్యోగి కొడుకుకు వైద్య సహాయం కోసం మంత్రిని కలిసినట్టుగా రెవిన్యనూ అధికారులు ప్రకటించారు. కొత్త రెవిన్యూ చట్టం గురించి తాము తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ గురించి చర్చించలేదన్నారు. 

కొత్త రెవిన్యూ చట్టం గురించి సమాచారం బయటకు రావడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు.ఈ విషయమై కేసీఆర్ మంత్రి ఈటల రాజేందర్ పై చర్య తీసుకొనే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

click me!