ఓవైపు స్వామి వారికి అభిషేకం.. పుష్కరిణిలో ఈవో జలకాలు, వీడియో వైరల్

Siva Kodati |  
Published : May 26, 2023, 05:41 PM ISTUpdated : May 26, 2023, 05:43 PM IST
ఓవైపు స్వామి వారికి అభిషేకం.. పుష్కరిణిలో ఈవో జలకాలు, వీడియో వైరల్

సారాంశం

స్వామి వారి విగ్రహాలకు ఆలయ అర్చకులు పుష్కరిణి వద్ద ప్రత్యేక అభిషేకం చేస్తుండగా.. ఆ పక్కనే ఈవో ఈత కొట్టడం నిజామాబాద్‌లో కలకలం రేపుతోంది. స్థానిక శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో ఈ ఘటన జరిగింది. 

నిజామాబాద్‌ నగరంలోని శ్రీ నీలకంఠేశ్వరస్వామి దేవాలయంలో అపచారం జరిగింది. స్వామి వారి విగ్రహాలకు ఆలయ అర్చకులు పుష్కరిణి వద్ద ప్రత్యేక అభిషేకం చేస్తుండగా.. ఆ పక్కనే ఈవో ఈత కొట్టారు. వివరాల్లోకి వెళితే.. సదరు ఈవోను వేణుగా గుర్తించారు. ఇతను ఆ పరిసరాల్లోని నాలుగు ఆలయాలకు ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నీలకంఠేశ్వర స్వామి విగ్రహాలకు పుష్కరిణి వద్ద అభిషేకం కార్యక్రమం చేపట్టారు అర్చకులు.

అయితే ఈ సమయంలో వేణు పుష్కరిణిలోకి దిగా ఈత కొట్టారు. దీనిపై పూజారులు అభ్యంతరం తెలిపినా వారి మాటను పట్టించుకోలేదు. దీంతో అభిషేకం కార్యక్రమానికి వచ్చిన భక్తుల్లో ఒకరు సెల్‌ఫోన్ ‌లో ఈవో ఈత కొడుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఆలయ పవిత్రను రక్షించాల్సిన హోదాలో వుండి, అపచారానికి పాల్పడ్డారంటూ మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu