హైద్రాబాద్ పోలీసులు ముంబైలో ఆపరేషన్ నిర్వహించారు. ముంబైలో డ్రగ్ పెడర్లను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: ముంబైలో హైద్రాబాద్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. హైద్రాబాద్ పోలీసులు ముంబైలో ఆపరేషన్ నిర్వహించి డ్రగ్ పెడ్లర్ ను అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతను ఇచ్చిన సమాచారం మేరకు ముంబైలో దాడులు నిర్వహించారు. ముంబైలో డ్రగ్ పెడ్లర్ ను ఇవాళ అరెస్ట్ చేశారు.
శుక్రవారం నాడు సాయంత్రం తన కార్యాలయంలో అడిసనల్ డీసీపీ రమణారెడ్డి ఈ కేసు వివరాలను మీడియాకు తెలిపారు. హైద్రాబాద్ లో ఎవరెవరికి వీరు డ్రగ్స్ విక్రయిస్తున్నారనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్టుగా అడిషన్ డీసీపీ చెప్పారు. హైద్రాబాద్ లో డ్రగ్స్ విక్రయించే వారిపై నిఘాను ఏర్పాటు చేసినట్టుగా డీసీపీ తెలిపారు. డ్రగ్స్ విక్రయించేవారితో పాటు డ్రగ్స్ కొనుగోలు చేసే వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నామన్నారు.,
also read:హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ. 41.3 కోట్ల హెరాయిన్ సీజ్: మహిళ అరెస్ట్
హైద్రాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా కాకండా చర్యలు తీసుకున్నామన్నారు.హైద్రాబాద్ లో విద్యనభ్యసించే పేరుతో వచ్చే నైజీరియన్లు డ్రగ్స్ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. గతంలో కూడా హైద్రాబాద్ పోలీసులు ముంబై, గోవాలలో దాడులు నిర్వహించారు. డ్రగ్స్ ను హైద్రాబాద్ కు సరఫరా చేస్తున్నవారిని గుర్తించి అరెస్ట్ చేశారు.