సచివాలయ నిర్మాణంపై మంత్రులకు నిపుణుల కమిటీ నివేదిక

By narsimha lodeFirst Published Aug 28, 2019, 5:23 PM IST
Highlights

కొత్త సచివాలయ నిర్మాణంపై నిపుణుల కమిటీ కేబినెట్ సబ్ కమిటీకి బుధవారం నాడు నివేదికను అందించింది.

హైదరాబాద్: తెలంగాణ సచివాలయ నిర్మాణంపై నలుగురు ఇంజనీర్స్ ఇన్ చీఫ్‌లతో కూడిన టెక్నికల్ కమిటీ బుధవారం నాడు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి నివేదికను అందించింది.

కొత్త సచివాలయ నిర్మాణంపై  రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కొత్త సచివాలయం పై కేబినెట్ సబ్ కమిటీని కూడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిపుణుల కమిటీ నివేదికను సీఎం అందిస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

ఈ ఏడాది జూలై 27వ తేదీన సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చేందుకు వీలుగా బూర్గుల రామకృష్ణారావు భవనంలో  సచివాలయాన్ని నిర్వహిస్తున్నారు. పాత సచివాలయం నుండి బూర్గుల రామకృష్ణారావు భవనంలోకి కొన్ని శాఖలను షిఫ్ట్ చేశారు.


 

click me!