కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాల నేతల భేటీ: హమీల అమలుపై చర్చ

Published : Mar 21, 2021, 02:33 PM IST
కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాల నేతల భేటీ: హమీల అమలుపై చర్చ

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం నాడు సమావేశమయ్యారు.   

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం నాడు సమావేశమయ్యారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఉద్యోగ సంఘాలతో సమావేశమైన కేసీఆర్  పీఆర్సీ విషయంలో హామీలిచ్చారు.పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చిస్తున్నారు. మరో వైపు ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సును పెంచాలని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. 

మరో వైపు ప్రమోషన్ల విషయంలో గతంలో ఉన్న  నిబంధనలను కూడ సడలిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయాలపై విధి విధానాలను రూపొందించేందుకు ఆయన ఉద్యోగ సంఘాలతో చర్చించారు.

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించడంతో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయమై కేసీఆర్ కేంద్రీకరించారు. ఇదే విషయమై కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో చర్చిస్తున్నట్టుగా సమాచారం.

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!