నిలోఫర్ ఆస్పత్రిలో ఉద్యోగుల ఆందోళన

By telugu teamFirst Published Jul 9, 2019, 10:26 AM IST
Highlights

నిలోఫర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యురిటీ కార్మికుల జీతాలు రెండు నెలలు రావడం లేదని ఆరోపిస్తూ వారు ఈ ఆందళన చేపట్టారు.
 
గత రెండు రోజులుగా ధర్నా చేస్తున్నా.. తమను అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీతాలు రావడం లేదని సంబంధిత కాంట్రాక్టర్ ని అడిగితే.. ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తేనే ఇస్తామని చెబతున్నారని వాపోయారు. సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

రెండు రోజుల్లో తమకు రావాల్సిన జీతాలు ఇవ్వకపోతే 24 ఆస్పత్రులలో తమ సేవలు నిలిపివేసి.. నిరవధిక సమ్మెకు దిగుతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.

click me!