కరోనా మృతదేహానికి దహనసంస్కారాలు.. పోలీసుల మానవత్వం.. (వీడియో)

By AN TeluguFirst Published May 12, 2021, 9:45 AM IST
Highlights

కరోనా సోకి మృతిచెందిన వ్యక్తి దహాన సంస్కారాలు నిర్వహించి ఇల్లంతకుంట ఎస్సై ప్రవీణ్ రాజ్ మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనాతో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేయడానికి ఎవ్వరు ముందుకు రాకపోవడంతో రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట పోలీసులు అత్యంత ధైర్య సాహాసాలు చూపించి దహన సంస్కారాలు చేశారు.

"

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన సంపత్ అనే యువకుడు, అతని కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. వీరిది బీద కుటుంబం కావడం తో ఇంట్లోనే ఉంటున్నారు.

ఈరోజు ఉదయం సంపత్ గ్రామంలోని చెరువుగట్టుకు బహిర్భూమికి వెళ్ళి తిరిగి రాకపోవడంతో సోదరుడు వెళ్ళి చూడగా చెరువులో శవమై కనిపించాడు. గ్రామస్థులకి తెలిపిన ఎవ్వరూ కూడా మృతదేహన్ని తరలించేందుకు ముందుకు రాలేదు. 

దీంతో విషయం తెలుసుకున్న ఇల్లంతకుంట ఎస్సై ప్రవీణ్ రాజ్, శిక్షణ ఎస్సై రజనీకాంత్ సహాయంతో రెండు చెద్దర్లు తెప్పించి స్వయంగా వారే మృతదేహన్ని ట్రాలీ ఆటోలో ఆసుపత్రి కి తరలించారు. అనంతరం సొంత ఖర్చుతో దహన సంస్కారాలకి ఏర్పాటు చేసి వారే దహన సంస్కారాలు జరిపించారు.

మానవత్వంతో కరోనాతో మృతిచెందిన వ్యక్తి దహన సంస్కారాలు నిర్వహించిన ఇల్లంతకుంట పోలీసులని అన్ని వర్గాల ప్రజలు అభినందించారు. పోలీసులు కాఠిన్యమే కాదు  మానవత్వం కూడా ఉందని అని నిరూపించుకున్నారని ప్రశంసించారు. 

click me!