మంత్రి హరీష్ కు ఈసీ షాక్: కేసు నమోదు చెయ్యాలని ఆదేశం

By Nagaraju TFirst Published Dec 1, 2018, 3:24 PM IST
Highlights

తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణపై హరీశ్‌ పై సిద్దిపేట వన్‌టౌన్‌ పీఎస్ లో శుక్రవారం కేసు నమోదైంది. సిద్దిపేటలో సెప్టెంబరు 30న ఆర్యవైశ్య సంఘం నిర్వహించిన ఆశీర్వాద సభకు మంత్రి హాజరై విరాళాలు స్వీకరించారనే ఆరోపణలు వచ్చాయి.

సిద్దిపేట: తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణపై హరీశ్‌ పై సిద్దిపేట వన్‌టౌన్‌ పీఎస్ లో శుక్రవారం కేసు నమోదైంది. సిద్దిపేటలో సెప్టెంబరు 30న ఆర్యవైశ్య సంఘం నిర్వహించిన ఆశీర్వాద సభకు మంత్రి హాజరై విరాళాలు స్వీకరించారనే ఆరోపణలు వచ్చాయి.

ఆర్యవైశ్య సంఘం సమావేశానికి హాజరు, విరాళాలు స్వీకరించారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వెళ్లింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిద్దిపేట నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జయచంద్రారెడ్డి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రిపై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125 సెక్షన్‌ కింద, ఐపీసీ 188 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

click me!