ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా అధికారులపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

తెలంగాణ  మంత్రి శ్రీనివాస్ గౌడ్  సహా  అధికారులపై  కేసు నమోదు  చేయాలని ప్రజా ప్రతినిధుల  కోర్టు  సోమవారం నాడు  సంచలన తీర్పును వెల్లడించింది.

Elected representatives  court Orders  To  File Case Against Minister  Srinivas Goud and others lns


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా  ఐఎఎస్ అధికారులపై  కేసు నమోదు  చేయాలని ప్రజా ప్రతినిధుల  కోర్టు  సోమవారంనాడు  ఆదేశించింది.2018  అసెంబ్లీ ఎన్నికల సమయంలో  మంత్రి శ్రీనివాస్ గౌడ్   ఎన్నికల సంఘానికి  అఫిడవిట్ ను సమర్పించారు. 2018  నవంబర్  14న  శ్రీనివాస్ గౌడ్   నామినేషన్ దాఖలు  చేశారు.  నామినేషన్ దాఖలు  చేసిన సమయంలో  అఫిడవిట్ ను  కూడ  సమర్పించారు. 

అయితే  ఎన్నికల ఫలితాలు వెలువడడానికి రెండు  రోజుల ముందు ఈసీ వెబ్ సైట్ లో కొత్త అఫిడవిట్  అప్ లోడ్  చేసినట్టుగా  మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై  ఫిర్యాదు  చేశారు.  తొలుత ఈసీకి సమర్పించిన అఫిడవిట్ స్థానంలో కొత్త అఫిడవిట్ ను  సమర్పించినట్టుగా  మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై  కొందరు  ఫిర్యాదు  చేశారు.రాష్ట్ర, కేంద్ర ఎన్నికల  ఎన్నికల అధికారులతో పాటు  రిటర్నింగ్ అధికారులపై  కేసు నమోదు  చేయాలని  కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Latest Videos

అయితే  ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్  అవాస్తవమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. తనపై  వచ్చని ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.  తనపై తప్పుడు  ఆరోపణలతో  ఫిర్యాదులు చేయించారని  మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ ఏడాది జనవరి మాసంలో ఆరోపించారు.  తనపై చేసిన ఫిర్యాదు వెనుక ఓ మాజీ మంత్రి, ఓ మాజీ ఎంపీ ఉన్నారని  శ్రీనివాస్ గౌడ్ ఆరోపణలు  చేసిన  విషయం తెలిసిందే. 

also read:మంత్రికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు: శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత

ఇదిలా ఉంటే  మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై తెలంగాణ హైకోర్టులో  కూడ  పిటిషన్ దాఖలైంది.   ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు  వివరాలు ఇచ్చారని  రాఘవేందర్ రాజు అనే వ్యక్తి  మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ ను కొట్టివేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్  దాఖలు  చేసిన పిటిషన్ ను ఈ నెల  25న  కొట్టివేసింది. 

   


 

vuukle one pixel image
click me!