మంత్రి మల్లారెడ్డి కొడుకు ఫిర్యాదు, ఐటీ అధికారిపై కేసు: నాలుగు వారాల స్టే ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

By narsimha lode  |  First Published Nov 25, 2022, 4:37 PM IST

మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి   ఇచ్చిన  ఫిర్యాదు మేరకు ఐటీ  అధికారిపై   నమోదైన కేసులో  తెలంగాణ హైకోర్టు  నాలుగు వారాల పాటు  స్టే ఇచ్చింది. 


హైదరాబాద్: మంత్రి  మల్లారెడ్డి కుటుంబసభ్యులు  ఇచ్చిన  ఫిర్యాదు ఆధారంగా బోయినపల్లి  పోలీస్ స్టేషన్ లో  నమోదు చేసిన  కేసుపై   తెలంగాణ హైకోర్టు  నాలుగు  వారాల పాటు  స్టే  ఇస్తూ  శుక్రవారంనాడు  ఆదేశాలు  జారీ  చేసింది.  బుధవారంనాడు  రాత్రి ఐటీ  సోదాల  సందర్భంగా  హైడ్రామా  చోటు  చేసుకుంది.  తన  పెద్ద  కొడుకు  మహేందర్ రెడ్డితో  ఐటీ  అధికారులు  బలవంతంగా  సంతకం చేయించారని  మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.  ఐటీ  అధికారలు  తయారు చేసిన స్టేట్ మెంట్  పై  మహేందర్ రెడ్డితో  సంతకం  చేయించారన్నారు. ఆసుపత్రిలో  ఉన్న మహేందర్ రెడ్డితో  బలవంతంగా  సంతకం చేయించారని మంత్రి మల్లారెడ్డి  చెప్పారు. ఈ  విషయమై  ఐటీ  అధికారి రత్నాకర్  పై  మంత్రి  మల్లారెడ్డి  చిన్న కొడుకు  భద్రారెడ్డి  పోలీసులకు  ఫిర్యాదు  చేశారు.ఈ పిర్యాదు  మేరకు  పోలీసులు ఐటీ  అధికారులపై  కేసు నమోదు చేశారు.  మరో  వైపు  ఐటీ  అధికారుల ఫిర్యాదు మేరకు  మంత్రి  మల్లారెడ్డి పై కూడా పోలీసులు  కేసు నమోదు  చేశారు. 

గురువారం నాడు  ఉదయంతో  మంత్రి  మల్లారెడ్డి నివాసంలో  ఐటీ  సోదాలు  ముగిశాయి.  మంత్రి మల్లారెడ్డితో పాటు  ఆయన  బంధువులకు  చెందిన బ్యాంకు  లాకర్లను  ఐటీ  అధికారులు తీసుకెళ్లారు.ఐటీ  అధికారుల  బ్యాంకు  లాకర్లను  ఓపెన్  చేయనున్నారు.మంత్రి  మల్లారెడ్డి సహా  16 మందిని విచారణకు రావాలని ఇప్పటికే  ఐటీ  శాఖ  నోటీసులు ఇచ్చింది. ఈ  నోటీసుల ఆధారంగా  మల్లారెడ్డి  కుటుంబ సభ్యులు  విచారణకు హాజరు కానున్నారు. 

Latest Videos

మంగళ, బుధవారాలు  రెండు  రోజుల పాటు  ఐటీ  అధికారులు సోదాలు నిర్వహించారు.  న్యూఢిల్లీకి  చెందిన  సుమారు  50 మంది  బృందాలు  సోదాలు చేశాయి.  ఈ సోదాలపై  మంత్రి  మల్లారెడ్డి మండిపడ్డారు.  ఈ  దాడుల  వెనుక బీజేపీ  హస్తం  ఉందన్నారు. కక్షపూరితంగానే  తమపై  దాడులు  చేస్తున్నారని  మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.

తనపై  ఇప్పటికే   మూడు దఫాలు  ఐటీ సోదాలు జరిగాయని  మంత్రి  మల్లారెడ్డి  చెప్పారు.  గతంలో  రెండు  దఫాలు  ఐటీ సోదాలు  జరిగిన  విషయాన్ని మంత్రి  మల్లారెడ్డి  చెప్పారు.  ఐటీ  సోదాల సమయంలో  మంత్రి మల్లారెడ్డి అల్లుడు  ఇండియాలో  లేడు. టర్కీలో  విహారయాత్రకు వెళ్లిన  మర్రి రాజశేఖర్  రెడ్డి  హుటాహుటిన  టర్కీ నుండి  హైద్రాబాద్ కు తిరిగి  వచ్చాడు.  ఢిల్లీ ఆదేశాలతోనే  ఐటీ దాడులు  జరిగాయని  ఆయన  ఆరోపించారు.  పార్టీ  మారాలనే  ఉద్దేశ్యంతోనే ఐటీమ  సోదాలు  నిర్వహించారని  కూడా  రాజశేఖర్  రెడ్డి ఆరోపించారు. 


  

click me!