సంగారెడ్డిలో శిశువు అదృశ్యం: రెండు రోజులైనా దొరకని ఆచూకీ

By Siva KodatiFirst Published May 8, 2019, 9:27 AM IST
Highlights

సంగారెడ్డిలో మాతా శిశు సంరక్షణా కేంద్రంలో ఆదృశ్యమైన శిశువు ఆచూకీ రెండు రోజులైనా ఇంకా లభించలేదు. దీంతో పసికందు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు

సంగారెడ్డిలో మాతా శిశు సంరక్షణా కేంద్రంలో ఆదృశ్యమైన శిశువు ఆచూకీ రెండు రోజులైనా ఇంకా లభించలేదు. దీంతో పసికందు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శిశువును ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని మహిళ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

లేక లేక పుట్టిన బిడ్డ కనిపించకుండా పోవడానికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గుర్తు తెలియని మహిళకు సిబ్బంది శిశువును అప్పగించినట్లు ఆసుపత్రిలో రికార్డైన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

దీని ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సంగారెడ్డి మండలం కల్పగూర్‌కు చెందిన హన్మోజిగారి మల్లేశం భార్య మాధవి గత నెల 29న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. 4 రోజుల క్రితం శిశువుకు కామెర్లు రావడంతో సంగారెడ్డిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పించారు.

ఈ క్రమంలో సోమవారం ఉదయం ఓ గుర్తు తెలియని మహిళ ఆస్పత్రిలోకి ప్రవేశించింది. అక్కడున్న వనిత అనే ఆయా ఆమెను మల్లేశం కుటుంబసభ్యురాలని భావించి శిశువును ఆమెకు అప్పగించింది.

అయితే బిడ్డను తమ కుటుంబసభ్యులు ఎవరు తీసుకురాలేదని మాధవి ఆయాను ప్రశ్నించింది. ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదం అనంతరం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

click me!