కస్టడీలోకి శ్రీనివాస్ రెడ్డి: కుటుంబసభ్యుల కోసం గాలింపు, ఫ్రెండ్స్‌పై నిఘా

Siva Kodati |  
Published : May 08, 2019, 09:12 AM IST
కస్టడీలోకి శ్రీనివాస్ రెడ్డి: కుటుంబసభ్యుల కోసం గాలింపు, ఫ్రెండ్స్‌పై నిఘా

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న అతనిని మరికొద్దిసేపట్లో అదుపులోకి తీసుకోనున్నారు.

బుధవారం నుంచి ఈ నెల 13 వరకు శ్రీనివాస్‌ను కస్టడీలోకి తీసుకోనేందుకు న్యాయస్థానం రాచకొండ పోలీసులకు అనుమతినిచ్చింది. మరోవైపు శ్రీనివాస్ కుటుంబసభ్యుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

ఈ కేసులో శ్రీనివాస్ రెడ్డికి బెయిల్ రాకుండా వీలైనన్ని ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. నిందితుడి స్నేహితులపైనా నిఘా పెట్టిన పోలీసులు, అతను చేసిన నేరాల్లో వారి ప్రమేయం ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

కీసర, ఆదిలాబాద్, సిరిసిల్ల, వేములవాడ, కర్నూలు ప్రాంతాల్లో శ్రీనివాస్ రెడ్డి పనిచేసినందున అక్కడ ఇంకేమైనా నేరాలు చేశాడా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం