స్నేహితులతో కలిసి పార్టీకి, ఆపై స్విమ్మింగ్‌పూల్‌లో శవమై తేలిన బీటెక్ విద్యార్ధి

Siva Kodati |  
Published : Sep 18, 2022, 07:25 PM IST
స్నేహితులతో కలిసి పార్టీకి, ఆపై స్విమ్మింగ్‌పూల్‌లో శవమై తేలిన బీటెక్ విద్యార్ధి

సారాంశం

హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో స్విమ్మింగ్‌పూల్‌లో పడి ఇంజనీరింగ్ విద్యార్ధి మరణించిన వ్యవహారం కలకలం రేపుతోంది. ఐదు అడుగుల లోతు మాత్రమే వున్న స్విమ్మింగ్‌‌పూల్‌లో పడి తమ కుమారుడు చనిపోయే అవకాశం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

స్విమ్మింగ్‌పూల్‌లో ఇంజనీరింగ్ విద్యార్ధి అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సయ్యద్ ఫ్రెండ్స్‌తో కలిసి చాంద్రాయణ గుట్టలోని స్విమ్మింగ్‌పూల్‌కి వెళ్లాడు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు స్నేహితులతో కలిసి ఏంజాయ్ చేశాడు. ఇక స్విమ్మింగ్ చేసి మిగతా స్నేహితులు బయటకు రాగా.. సయ్యద్ మాత్రం బయటకు రాలేకపోయాడు. అనంతరం గాలించగా నీటి అడుగున మృతదేహం లభించింది. సయ్యద్‌కు ఈత కూడా సరిగా రాదని తెలుస్తోంది. పైగా స్విమ్మింగ్ పూల్ లోతు 5 అడుగులు మాత్రమే. అంత తక్కువ లోతు వుండగా.. సయ్యద్ ఎలా చనిపోతాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సయ్యద్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ