లోన్ యాప్ సంస్థలపై ఈడీ సోదాలు: దేశంలో16 చోట్ల కొనసాగుతున్న తనిఖీలు

By narsimha lode  |  First Published Sep 16, 2022, 1:29 PM IST

దేశ వ్యాప్తంగా 16 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. విదేశాలకు అక్రమంగా  లోన్ యాప్ సంస్థలు నగదును తరలించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. 


హైదరాబాద్: లోన్ యాప్ సంస్థలపై దేశంలోని 16 చోట్ల ఈడీ అధికారులు శుక్రవారం నాడు సోదాలు చేస్తున్నారు.  లోన్ సంస్థలు విదేశాలకు అక్రమంగా నగదును తరలించారని ఈడీ అధికారులు గుర్తించారు. పలు యాప్ ల ద్వారా విదేశాలకు ఈ సంస్థలు  నగదును తరలించారని ఈడీ గుర్తించింది. 

డిల్లీ, గురుగ్రామ్, పుణె, చెన్నై, హైద్రాబాద్, జైపూర్, జోథ్ పూర్, బెంగుళూరులలో ఈడీ అధికారులు   ఇవాళ సోదాలు చేస్తున్నారు. హెచ్‌పీజడ్ పేరుతో భారీగా అనధికార లావాదేవీలు జరిగినట్టుగా  ఈడీ అధికారులు గుర్తించారు. 3 గేట్ వేల నుండి విదేశాలకు నగదు తరలించారని అధికారులు గుర్తించారు. 

Latest Videos

undefined

also read:ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు:తెలంగాణ సహ నాలుగు రాష్ట్రాల్లో సోదాలు

ఈజీ బజ్ ద్వారా రూ. 33 కోట్లు, రోజర్ పే ద్వారా రూ8 కోట్లు, క్యాష్ ఫ్రీ ద్వారా రూ. 1.50 కోట్లు విదేశాలకు బదిలీ చేశారని ఈడీ అధికారులు గుర్తించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.  ఈ లోన్ యాప్స్ వెనుక చైనా కంపెనీలు ఉన్నాయని ఈడీ అధికారులు గుర్తించారు.. గతంలో ఈ విషయమై  కొన్ని లోన్ యాప్ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ పోలీసులు దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి లోన్ యాప్ సంస్థలు నిర్వహిస్తున్న కాల్ సెంటర్లతో పాటు కీలకమైన వారిని అరెస్ట్ చేశారు. ఆయా రాష్ట్రాల్లోని బ్యాంకు ఖాతాలను కూడా పోలీసులు స్థంభింప చేసిన విషయం తెలిసిందే.  

లోన్ యాప్ సంస్థలపై గతంలో కూడ ఈడీ అధికారులు సోదాలు చేశారు ఈ నెల 2వ తేదీన పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ ఏడాది ఆగస్టు 3వతేదీన పలు లోన్ యాప్ సంస్థలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.  ఈ ఏడాది ఆగస్టు నాటికి పలు లోన్ యాప్ సంస్థలకు చెందిన రూ. 819 కోట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. 

 ఇండిడ్రేడ్ ,పిన్ క్రాఫ్, ఆగ్లో ఫిన్ ట్రైడ్ తో పాటు ఫిన్ టెక్ కంపెనీల నగదు సీజ్ చేసింది ఈడీ. మరో వైపు 230 బ్యాంకు ఖాతాలను కూడా  ఈ ఏడాది ఆగస్టులో   ఫ్రీజ్ చేసింది.  చైనా కంపెనీలు సుమారు రూ. 4300 కోట్లను లోన్ యాప్ ల రూపంలో తరలించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు.ఈ ఏడాది ఆగస్టు మాసంలో నిర్వహించిన సోదాలకు కొనసాగింపుగా ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నారు. 

click me!