అగ్రిగోల్డ్ నిందితులకు రిమాండ్, చంచల్‌గూడకు తరలింపు

By Siva KodatiFirst Published Dec 23, 2020, 2:26 PM IST
Highlights

తక్కువ పెట్టుబడికి ఎక్కువ వడ్డి ఇస్తామంటూ ఆశ చూపి డిపాజిట్‌దారుల నుంచి పెద్దఎత్తున నిధులు సేకరించి మోసానికి పాల్పడిన కేసులో అగ్రిగోల్డ్‌ సంస్థ నిర్వాహకులను ఈడీ అరెస్ట్ చేసింది

తక్కువ పెట్టుబడికి ఎక్కువ వడ్డి ఇస్తామంటూ ఆశ చూపి డిపాజిట్‌దారుల నుంచి పెద్దఎత్తున నిధులు సేకరించి మోసానికి పాల్పడిన కేసులో అగ్రిగోల్డ్‌ సంస్థ నిర్వాహకులను ఈడీ అరెస్ట్ చేసింది.

అనంతరం వారిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అగ్రిగోల్డ్ ఛైర్మన్‌ అవ్వ వెంకట రామారావు, డైరెక్టర్‌ శేషు వెంకట నారాయణ, హేమసుందర ప్రసాద్‌లకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది.

దీంతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఈ ముగ్గురు నిందితులను కస్టడీ కోరుతూ ఈడీ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్టు సమాచారం.  

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 9 లక్షల మంది డిపాజిట్‌దారుల నుంచి అగ్రిగోల్డ్ సంస్థ రూ.6,380 కోట్లు వసూలు చేసింది. అయితే ఆ నిధుల్ని ఇతర వ్యాపారాల్లోకి మళ్లించడం ద్వారా నిర్వాహకులు మోసానికి పాల్పడినట్లు మూడు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.

ఐబీ, సెబీ ముందస్తు హెచ్చరికలను సైతం వీరు బేఖాతరు చేశారు. ఈ క్రమంలోనే ఛైర్మన్‌ సహా పలువురు నిందితుల్ని అరెస్ట్‌ చేసింది. సీఐడీ కేసు ఆధారంగానే ఈడీ దర్యాప్తు ఆరంభించింది.  

click me!