గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలు నిబంధనలకు విరుద్దం: తెలంగాణ హైకోర్టులో పిటిషన్

By narsimha lodeFirst Published Dec 23, 2020, 1:57 PM IST
Highlights

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలను సవాల్ చేస్తూ బుధవారం నాడు  పిటిషన్ దాఖలైంది.
 

హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలను సవాల్ చేస్తూ బుధవారం నాడు  పిటిషన్ దాఖలైంది.

గవర్నర్ కోటాలో  గోరటి వెంకన్న, బస్వరాజ్ సారయ్య, దయానంద్ లను ఎమ్మెల్సీలుగా  నియమించడంపై పిటిషన్ దాఖలైంది. ధనగోపాల్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. 

రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ ముగ్గురిని ఎమ్మెల్సీలుగా నియమించారని ధనగోపాల్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తన పేరును గవర్నర్ రెండుసార్లు ప్రతిపాదించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. 

తెలంగాణ మంత్రివర్గం సిఫారసులను ఆమోదించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఈ విషయమై పిటిషనర్ వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 

వచ్చే నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.చీఫ్ సెక్రటరీ, గోరటి వెంకన్న, సారయ్య, దయానంద్ లకు నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లోపుగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

click me!