తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: నత్తనడకన కౌంటింగ్.. వేగం పెంచేందుకు ఈసీ చర్యలు

By Siva KodatiFirst Published Mar 19, 2021, 9:02 PM IST
Highlights

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వేగం పెంచాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనిలో భాగంగా టేబుల్స్ సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. కౌంటింగ్ ఏజెంట్లను సమకూర్చుకోవాలని అభ్యర్ధులకు సూచించారు అధికారులు

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వేగం పెంచాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనిలో భాగంగా టేబుల్స్ సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. కౌంటింగ్ ఏజెంట్లను సమకూర్చుకోవాలని అభ్యర్ధులకు సూచించారు అధికారులు. ప్రస్తుతం ఒకే టేబుల్‌పై ఎలిమినేషన్ అభ్యర్ధుల ఓట్లను లెక్కిస్తున్నారు. 

హైదరాబాద్ స్థానంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ అభ్యర్ధి వాణీదేవికి 1,13,015, బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావుకు 1,04,960, ఇండిపెండెంట్ అభ్యర్ధి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు 53,792, కాంగ్రెస్ అభ్యర్ధి చిన్నారెడ్డికి 31,710 ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో ఇప్పటి వరకు 40 మంది అభ్యర్ధులు ఎలిమినేట్ అయ్యారు. 

నల్గొండ విషయానికి వస్తే.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ 55 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,11,190, తీన్మార్ మల్లన్న 83,629, కోదండరామ్ 70,472, బీజేపీ 39,268, కాంగ్రెస్ 27,713, లెఫ్ల్ 9,657, చెరుకు సుధాకర్ 7,903 ఓట్లు పోలయ్యాయి. 

click me!