నన్ను చంపడానికి ఈటల రాజేందర్ కుట్రలు... హత్యాయత్నం కూడా: కౌశిక్ రెడ్డి సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : Jul 20, 2021, 02:03 PM IST
నన్ను చంపడానికి ఈటల రాజేందర్ కుట్రలు... హత్యాయత్నం కూడా: కౌశిక్ రెడ్డి సంచలనం

సారాంశం

మంత్రిగా వున్న సమయంలో ఈటల రాజేందర్ తనను హతమార్చడానికి కుట్రలు పన్నారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈటల తనపై హత్యకు కుట్ర జరిగిందన్న సమయంలోని కౌశిక్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ చర్చకు దారితీసింది. 

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయాలు రోజురోజుకు మరింత వేడెక్కుతున్నాయి. అన్ని పార్టీలు ఇప్పటికే మాటల యుద్దాన్ని ప్రారంభించి నియోజకవర్గంలో వేడి పుట్టిస్తున్నారు. తాజాగా ప్రజా దీవెన యాత్ర పేరిట పాదయాత్ర చేపట్టిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన హత్యకు కుట్ర జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఈటల గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనను హతమార్చడానికి ప్రయత్నించారని ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు.

మంత్రి పదవిలో వుండగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈటల తనను హతమార్చడానికి ప్రయత్నించాడని కౌశిక్ తెలిపారు. 2018లో మర్రిపల్లిగూడ గ్రామంలో తనను చంపించే ప్రయత్నం చేసి విఫలమయ్యాడని ఆరోపించారు. తనను హతమార్చడం సాధ్యంకాక పోయినా మాజీ ఎంపీటీసీ బాలరాజ్‌ను మాత్రం హత్య చేశారు. ఇదీ ఈటల రాజేందర్ నేర చరిత్ర అంటూ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. 

read more  కౌశిక్ రెడ్డి కారు ప్రయాణం కరారు.. రేపే ముహూర్తం.. !

ఇదిలావుంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కౌశిక్ టీఆర్ఎస్ పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు. తన అనుచరులు, మిత్రులు, శ్రేయోభిలాషులతో చర్చించి అధికార టీఆర్ఎస్ లో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్‌లో చేరాలని మిత్రులు, అనుచరులు, అభిమానులు సూచించారని ... అందువల్లే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు  కౌశిక్ రెడ్డి వెల్లడించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో రేపు మద్యాహ్నం ఒంటిగంటకు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు కౌశిక్ ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనే టీఆర్ఎస్ లో చేరడానికి కారణమని కౌశిక్ రెడ్డి వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి