త్వరలో కాంగ్రెస్ గూటికి డిఎస్, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి

By rajesh yFirst Published Sep 13, 2018, 6:42 PM IST
Highlights

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీని గద్దె దించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. 

హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీని గద్దె దించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేస్తోంది.

ఒకవైపు పొత్తులు...టీఆర్ఎస్ పార్టీ అసంతృప్తులను, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారందరినీ పార్టీలోకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. 

అందులో భాగంగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న డీఎస్ కాంగ్రెస్ పార్టీకి గూటికి చేరబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది.

ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఉదయం నేరుగా డీఎస్‌ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాలపాటు చర్చించుకున్నారు.ఈ సందర్భంగా తిరిగి పార్టీలోకి రావాలని ఉత్తమ్‌ డీఎస్‌ను ఆహ్వానించారు.  

మరోవైపు డీఎస్ ఈనెల 14న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరికకు రంగం సిద్ధం అయినట్లు ప్రచారం జరుగుతుంది. డీఎస్ తోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. భూపతిరెడ్డికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గగం టిక్కెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హమీ ఇచ్చినట్లు సమాచారం.   

click me!