‘కృష్ణగారి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో...’ ఈ స్టంట్లు చేయకండి...

Published : Jul 09, 2021, 04:45 PM IST
‘కృష్ణగారి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో...’ ఈ స్టంట్లు చేయకండి...

సారాంశం

మత్తులో తూగి పోతూ, వేగంగా వెళ్తున్న కార్లకు, బైక్ లకు అడ్డం పడుతూ రహదారిపై ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాడు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్ : హెల్మెట్ పెట్టుకొని, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ, టూ వీలర్ పై జాగ్రత్తగా వెళ్లినా కూడా ఒక్కోసారి వేరే వారి అజాగ్రత్త వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి విరుద్ధంగా  ఓ ప్రబుద్ధుడు ఉదయాన్నే మద్యం తాగి,  హెల్మెట్ ను అద్దానికి తగిలించి, ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. 

మత్తులో తూగి పోతూ, వేగంగా వెళ్తున్న కార్లకు, బైక్ లకు అడ్డం పడుతూ రహదారిపై ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాడు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

చేవెళ్ల లోని ఇబ్రహీంపల్లి గేట్ వద్ద సీసీటీవీ లో రికార్డ్ అయిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘కృష్ణగారి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో’ అంటూ ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. 

పోలీస్ టెక్నికల్ టీం ఈ వీడియోకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బ్రహ్మానందం ఇమేజ్ జోడించి మద్యం సేవించి వాహనాలు నడపొద్దు.. అంటూ అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. మద్యం సేవించి బండి నడుపుతున్న వ్యక్తిని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather
Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather