మరో ఎన్నారై మొగుడి బాధితురాలు.. కట్నం కోసం

sivanagaprasad kodati |  
Published : Oct 24, 2018, 08:18 AM IST
మరో ఎన్నారై మొగుడి బాధితురాలు.. కట్నం కోసం

సారాంశం

కట్నం కోసం భార్యను చిత్రహింసలకు గురిచేస్తోన్న ఎన్నారై మొగుళ్ల బాగోతాలు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్తింటి వారు తనను డబ్బు కోసం మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఓ మహిళా మీడియా ముందుకు వచ్చింది

కట్నం కోసం భార్యను చిత్రహింసలకు గురిచేస్తోన్న ఎన్నారై మొగుళ్ల బాగోతాలు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్తింటి వారు తనను డబ్బు కోసం మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఓ మహిళా మీడియా ముందుకు వచ్చింది.

రహ్మత్‌నగర్‌కు చెందిన గుండా రాకేశ్‌కుమార్‌తో కవితకు 2003లో వివాహమైంది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కావడంతో బ్రిటన్‌లో స్థిరపడ్డారు. కొంతకాలం పాటు సవ్యంగానే సాగిన వీరి కాపురంలో ఏడాదిన్నర నుంచి కలతలు ప్రారంభమయ్యాయి.

యూకే నుంచి భారత్ వచ్చిన కవితను అత్తమామలు, మరిది కలిసి డబ్బు ఇవ్వాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. కాదు అన్నందుకు ఆమెను ఇంట్లో నుంచి గెంటివేశారు.. దీంతో ఏ దారిలేక పుట్టింటికి వరంగల్ వెళ్తే.. భర్తను మత్తుకు బానిస చేశారని ఆవేదన చెందారు.. తిరిగి మెట్టింటికి వెళితే ఇంట్లోకి రానియకుండా తిట్టడంతో పాటు దాడి చేశారు. దీంతో అత్తింటి వారిపై కవిత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి.. మీడియా సమావేశంలో తనకు జరిగిన అన్యాయాన్ని తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Vegetables Price : దిగజారిన టమాటా, స్థిరంగా ఉల్లి... ఈ వీకెండ్ కూరగాయల రేట్లు ఇవే
IMD Rain Alert : మరో అల్పపీడనం రెడీ .. ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు