జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేర చరితులకు సీట్లివ్వొద్దు: ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్

Published : Nov 16, 2020, 03:28 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేర చరితులకు సీట్లివ్వొద్దు: ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్

సారాంశం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేర చరితులకు టికెట్లు ఇవ్వొద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాజకీయ పార్టీలను కోరింది.  


హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేర చరితులకు టికెట్లు ఇవ్వొద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాజకీయ పార్టీలను కోరింది.

గతంలో పోటీ చేసిన వారిపై ఉన్న కేసుల వివరాలను కూడ ఈ సందర్భంగా ఆ సంస్థ విడుదల చేసింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడ పోటీ చేసిన అభ్యర్ధులపై ఉన్న కేసుల వివరాలను కూడ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ విడుదల చేస్తోంది.

2016 ఎన్నికల్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పోటీ చేసిన అభ్యర్ధులపై ఉన్న కేసుల వివరాలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సోమవారం నాడు విడుదల చేసింది.

అంతేకాదు ప్రస్తుతం జీహెచ్ఎంసీ కార్పోరేటర్లుగా ఉన్న వారిపై ఉన్న కేసుల వివరాలను కూడ ఈ సంస్థ ఇవాళ ప్రకటించింది.2016 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల్లో టీడీపీ 13, టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 13, బీజేపీ 4, 11 మంది ఇండిపెండెంట్ అభ్యర్ధులపై కేసులు ఉన్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్  తెలిపింది.

also read:దుబ్బాక బైపోల్‌లో విజయం: జీహెచ్ఎంసీపై కమలం కన్ను

అంతేకాదు 8 మంది మహిళలపై కూడ కేసులున్నాయి. 2016లో పోటీ చేసిన 72  మందిలో 20 మందిపై నేరచరిత్ర ఉన్నట్టుగా ఆ సంస్థ తెలిపింది.ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకవర్గంలో 20 మంది కార్పోరేటర్లపై కేసులున్నట్టుగా ప్రకటించింది. 

అంతేకాదు  కొత్తగా 17 మంది టీఆర్ఎస్ నేతలు, 13 మంది బీజేపీ నేతలపై కేసులు నమోదైనట్టుగా ఆ సంస్థ తెలిపింది.నేర చరిత్ర ఉన్న వారికి టికెట్లు ఇవ్వొద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆయా రాజకీయ పార్టీలను కోరింది.

PREV
click me!

Recommended Stories

Minister Sridhar Babu Comments: భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరిస్తాం | Asianet News Telugu
Hyderabad: నెల‌కు రూ. 67 ల‌క్ష‌ల అద్దె.. హైద‌రాబాద్‌లో ఫేస్‌బుక్ పెద్ద స్కెచ్