డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు: ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిన ప్రశ్నిస్తున్న పోలీసులు

By narsimha lode  |  First Published Dec 14, 2022, 11:14 AM IST


డాక్టర్ వైశాలి కిడ్నాప్  కేసులో  ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు  ప్రశ్నిస్తున్నారు. నిన్న రాత్రి గోవాలో  నవీన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైద్రాబాద్ కు తీసుకు వచ్చి నవీన్ రెడ్డిని  పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 


హైదరాబాద్: డాక్టర్ వైశాలి కిడ్నాప్  కేసులో ప్రధాన నిందితుడు  నవీన్ రెడ్డిని  పోలీసులు బుధవారంనాడు  సరూర్ నగర్  ఎస్ఓటీ కార్యాలయంలో   ప్రశ్నిస్తున్నారు. మంగళవారంనాడు  రాత్రి గోవాలో నవీన్ రెడ్డిని రాచకొండ పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. నవీన్ రెడ్డిని  పోలీసులు గోవా నుండి హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు. ఇవాళ  ఉదయం నుండి  నవీన్ రెడ్డిని  పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

డాక్టర్ వైశాలికి  నవీన్ రెడ్డితో  బాడ్మింటన్  ఆడే సమయంలో పరిచయం ఏర్పడింది.  ఈ పరిచయం తర్వాత  తనను పెళ్లి చేసుకోవాలని నవీన్ రెడ్డి డాక్టర్ వైశాలిని అడిగాడు. అయితే తన కుటుంబ సభ్యులతో మాట్లాడాలని డాక్టర్ వైశాలి  నవీన్ రెడ్డిని కోరింది.  అయితే  ఈ పెళ్లికి డాక్టర్ వైశాలి  పేరేంట్స్ అంగీకరించలేదు.   అప్పటి నుండి నవీన్ రెడ్డి  డాక్టర్ వైశాలిపై కక్ష పెంచుకున్నట్టుగా  పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.  

Latest Videos

also read:నేను చేసింది తప్పే.. దాని వెనుక చెప్పలేనంత పెయిన్ : వైశాలి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డి

డాక్టర్ వైశాలితో  సంబంధాలను పునరుద్దరించుకొనేందుకు గాను నవీన్ రెడ్డి తన స్నేహితుల సహయం తీసుకున్నాడని సమాచారం. డాక్టర్  వైశాలి  కదలికలను తెలుసుకొని  నవీన్ రెడ్డి  ఆమెను వేధింపులకు గురిచేసేవాడని  తెలుస్తుంది.  డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్లాన్  చేశారని రిమాండ్ రిపోర్టులో  పోలీసులు పేర్కొన్నారు.నిన్న గోవాలో అరెస్ట్  చేసిన  నవీన్ రెడ్డిని  పోలీసులు  హైద్రాబాద్ కు తీసుకు వచ్చి  ప్రశ్నిస్తున్నారు.  డాక్టర్ వైశాలి కిడ్నాప్ ఉదంతంపై  పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇవాళ  నవీన్ రెడ్డిని  పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.

 

click me!